
అక్కాచెల్లెళ్లకు పీహెచ్‌డీ పట్టాలు
బోథ్: ఉస్మానియా విశ్వవిద్యాలయం మంగళవారం నిర్వహించిన స్నాతకోత్సవంలో మండలంలోని సొనాలకు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఒకే వేదికపై పీహెచ్‌డీ పట్టాలు అందుకున్నారు. ఉస్మానియా యూనివర్శిటీలో ఇర్ల భాగ్యలక్ష్మి తెలుగు సాహిత్యంలో పరిశోధన చేయగా ఆమె చెల్లెలు ఉదయరాణి చరిత్రలో పరిశోధన చేసింది. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, ఇస్రో ఛైర్మన్ నారాయణ, వైన్స్‌ఛాన్సలర్ ఎం.కుమార్ చేతుల మీదుగా పీహెచ్‌డీ పట్టాలు అందుకున్నారు. విద్యారంగంలో తమదైన ముద్ర వేసుకుంటూ, ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఈ అక్కాచెల్లెళ్లు పలువురికి ఆదర్శంగా నిలిచారు. నిరంతర కృషి, పట్టుదల ఉంటే ఎంతటి ఉన్నతమైన లక్ష్యాలనైనా సాధించవచ్చని వారు పేర్కొంటున్నారు.