
వ్యాధుల వివరాలు నమోదు చేయాలి
మంచిర్యాలటౌన్: జిల్లాలో నమోదవుతున్న వి జల్స్ రూబెల్లా, డిప్తీరియా, పెరిటిసిస్, న్యూ మెంటల్ టిటానస్, ఏఎఫ్‌పీ వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఎస్‌ఎంవో డాక్ట ర్ అతుల్ సూచించారు. డీఎంహెచ్‌వో కార్యాలయంలో మంగళవారం జిల్లా వైద్యాధికారుల తో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. వ్యాధి ని ర్ధారణకు తప్పనిసరిగా శాంపిళ్లు సేకరించాల ని, ప్రైవేట్, ప్రభుత్వ వైద్యులకు వీటిపై అవగాహన కల్పించాలని, రోగాలకు సంబంధించి న వివరాలు నమోదు చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని సూచించారు. జిల్లా ప్రో గ్రాం అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్‌కు జిల్లా సర్వైలైన్స్ అధికారిగా బాధ్యతలు అప్పగించా రు. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ప్రసాద్, బెల్లంపల్లి డిప్యూటీ డీఎంహెచ్‌వో సుధాకర్ నాయక్, డీపీహెచ్ పద్మ, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, హెల్త్ ఆఫీసర్ సుమన్, జిల్లా మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్ పాల్గొన్నారు.