
కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూం
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో వారంరోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేసి 08736–250501 నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. 24గంటలు పని చేసే కంట్రోల్‌రూమ్‌లో అధికారులు అందుబాటులో ఉండి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. తమ కాలనీలోకి వరదనీరు చే రుతోందని.. కల్వర్టు జామ్ అయి వీధుల్లోకి నీ రు వస్తోందని.. ప్రమాదకరంగా వరద ప్రవహిస్తోందంటూ ఫిర్యాదులు వస్తుండడంతో రిజిస్టర్‌లో నమోదు చేస్తున్నారు. వెంటనే సంబంధి త తహసీల్దార్, గ్రామపంచాయతీ, మున్సిపల్ సిబ్బందికి తెలియపరుస్తూ అప్రమత్తం చేస్తున్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. అలాగే అవసరమైన సమయంలో వాగులు, నది, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి అ త్యవసర సేవలందించేందుకు 90మంది సభ్యులతో కూడిన మూడు ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను రక్షణ పరికరాలతో సిద్ధంగా ఉంచారు.