ఆస్తి పన్ను ఎగవేత? | - | Sakshi
Sakshi News home page

ఆస్తి పన్ను ఎగవేత?

Aug 20 2025 5:09 AM | Updated on Aug 20 2025 5:09 AM

ఆస్తి పన్ను ఎగవేత?

ఆస్తి పన్ను ఎగవేత?

● ఓసీపీ కాంట్రాక్ట్‌ కంపెనీల నిర్వాకం ● బల్దియాకు రూ.లక్షల్లో బకాయిలు ● ఆర్‌ఆర్‌ యాక్ట్‌ ప్రయోగిస్తున్నా అంతే..

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: శ్రీరాంపూర్‌ ఓసీపీ కంపెనీలో ఓబీ (ఓవర్‌ బర్డెన్‌) మట్టి వెలికితీత ప నులు చేపడుతున్న కాంట్రాక్ట్‌ సంస్థలు స్థానిక మున్సిపాలిటీకీ మాత్రం పన్ను చెల్లించడంలో అ లసత్వం వహిస్తున్నాయి. అధికారులు పలుసార్లు నోటీసులిస్తున్నా పట్టించుకోకపోవడంతో రూ.లక్షల్లో పన్నుల బకాయిలు పేరుకుపోయాయి. ఇ ప్పటివరకు రూ.58.50లక్షల వరకు స్థానిక సంస్థ కు పన్ను చెల్లించాల్సి ఉంది. అయితే సామాన్య పౌరుల ఇంటి పన్ను చెల్లించడంలో జాప్యం జరి గితే వెంటనే చర్యలు చేపట్టే అధికారులు బడా సంస్థలపై ఇప్పటివరకు కఠినచర్యలు తీసుకోవ డం లేదు. నస్పూర్‌ మున్సిపాలిటీగా ఉన్నపుడు నోటీసులిస్తూ సరిపెట్టారు. చివరకు కలెక్టర్‌ దృష్టి కి తీసుకెళ్లడంతో చర్యలు ప్రారంభించారు. అయి తే మున్సిపల్‌ అధికారులు బకాయిలు వసూలు చేయలేకపోతున్నారు. ప్రస్తుతం కార్పొరేషన్‌ ప్ర త్యేకాధికారిగా కలెక్టర్‌ ఉండడంతో ఆయన చర్యలు తీసుకుంటున్నారు. అయితే కంపెనీల నుంచి స్పందన లేదు. చివరకు రెవెన్యూ రికవరీ (ఆర్‌ఆర్‌) యాక్ట్‌ కింద ఆస్తుల స్వాధీనానికి కూడా ఆ దేశాలిచ్చారు. అయితే ఆర్‌అండ్‌బీ అధికారులను భవన నిర్మాణాల క్యాంపు మదింపు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. కానీ, నాలుగు నెలలుగా ఆ కంపెనీ క్యాంపు నిర్మాణాల విలువ లెక్కగట్టి నివేదిక ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు. మరోవైపు ఆయా కంపెనీల స్థిరాస్తులతో పాటు చరాస్తులైన వాహనాలనూ ఆర్‌ఆర్‌ యాక్ట్‌ కింద రికవరీ చేస్తే కార్పొరేషన్‌కు ఆదాయం వచ్చే అవకాశముంది.

రూ.లక్షల్లో పన్ను బకాయిలు

జీవీఆర్‌ ఇన్‌ఫ్రా, సీఆర్‌ఆర్‌ క్యాంపు, గౌరవ్‌ కంపె నీలు గత కొన్నేళ్లుగా స్థానిక మున్సిపాలిటీకి ఆస్తి పన్ను చెల్లించడం లేదు. గతంలో నస్పూర్‌ ము న్సిపాలిటీ పరిధిలో ఉన్నప్పుడు అప్పటి అధికా రులకు ఈ మూడు కంపెనీలకు డిమాండ్‌ నోటీసులిచ్చారు. ఆ తర్వాత పలుసార్లు హెచ్చరిస్తూ నోటీసులు కూడా ఇచ్చారు. అయినప్పటికీ స్పందించ లేదు. 2022నుంచే ఆస్తిపన్ను బకాయిలు న్నాయి. రెండు సంస్థలు మూడేళ్ల పన్ను చెల్లించా ల్సి ఉండగా, జీవీఆర్‌ మాత్రం రెండేళ్ల ఆస్తి పన్ను చెల్లించాలి. వీటిలో అత్యధికంగా గౌరవ్‌ కంపెనీ రూ.21.92లక్షలు, సీఆర్‌ఆర్‌ రూ.18.48లక్షలు, జీవీఆర్‌ కంపెనీ రూ.18.10లక్షలు చెల్లించాలని నోటీసులో అధికారులు పేర్కొన్నారు. ఇందులో గౌరవ్‌ కంపెనీ ఇప్పటికే కాంట్రాక్ట్‌ ముగిసిపోయింది. గత మూడేళ్లుగా కంపెనీలకు నోటీసులి స్తున్నా పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం మిగతా రెండు కంపెనీలే పనులు నిర్వర్తిస్తున్నాయి. ప్రస్తు త ఆర్థిక సంవత్సరంలోనూ పన్ను చెల్లించాల్సి ఉంది. మరోవైపు సింగరేణి కంపెనీ నుంచి పను ల బిల్లుల చెల్లించే సమయంలోనైనా బకాయిలు వసూలు చేసుకునే అవకాశాన్ని పరిశీలిస్తే స్థానిక సంస్థకు ఆదాయం సమకూరనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement