
స్తంభాలపై కేబుల్ తొలగించాలి
చెన్నూర్: జిల్లాలోని విద్యుత్ స్తంభాలకు అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన కేబుల్‌ను వెంటనే తొలగించాలని ఎస్‌ఈ జాడే ఉత్తమ్ పేర్కొన్నా రు. గణేశ్ నవరాత్రోత్సవాల్లో ఎలాంటి విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు చెన్నూర్ మున్సి పాలిటీ పరిధిలో పర్యటించారు. స్తంభాలకు అమర్చిన కేబుల్‌ను పరిశీలించారు. అనంతరం స్థానిక విద్యుత్ సబ్ డివిజనల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 27నుంచి గణేశ్ నవరాత్రోత్సవాలు ప్రారంభమవుతాయని, నిర్వాహకులు విద్యుత్ తీగల కింద మండపాలు ఏర్పాటు చేయవద్దని తెలిపారు. పె ద్ద విగ్రహాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు విద్యు త్ అధికారులకు ముందస్తు సమాచారం ఇవ్వాల ని తెలిపారు. మండపాల కోసం నాణ్యమైన తీగలు వినియోగించాలని సూచించారు. జిల్లా వ్యా ప్తంగా స్తంభాలపై ఏర్పాటు చేసిన కేబుల్‌ను సంనిర్వాహకులు తొలగించకుంటే తమ సిబ్బంది తొలగిస్తారని తెలిపారు. ఏడీఏలు బాలకృష్ణ, వెంకటేశ్వర్లు, రమేశ్, ఏఈ శ్రీనివాస్ ఉన్నారు.
ప్రమాదకర లైన్లను సవరించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: స్తంభాలకున్న కేబుల్ వైర్లు తొలగించాలని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ క ర్నాటీ వరుణ్‌రెడ్డి సూచించారు. మంగళవారం హన్మకొండ విద్యుత్‌శాఖ కార్పొరేట్ కార్యాల యం నుంచి జిల్లా విద్యుత్‌శాఖ అధికారులతో వీ డియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ఏడాదిగా స్తంభాలపై వైర్లు తొలగించాలని కేబుల్ ఆ పరేటర్లకు చెప్పినా పట్టించుకోవడం లేదని తెలి పారు. ప్రమాదాల జరుగుతున్నాయని సంబంధి త యాజమాన్యాలకు రీఅలైన్మెంట్ చేసుకోవాలని సూచించామని, చేసుకోని పక్షంలో తొలగించా లని అధికారులను ఆదేశించారు. వినాయక మండపాలు పరిశీలించాలని, అధిక ఎత్తు ఉన్న విగ్రహాల తరలింపు ప్రాంతాల్లో ప్రమాదకర లైన్లను సవరించాలని సూచించారు. ఎస్‌ఈ ఉత్తమ్ జా డే, డీఈ ఖైసర్, ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు.