సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు.. ప్రయాణికులు ఒక్కసారిగా.. | - | Sakshi
Sakshi News home page

సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు.. ప్రయాణికులు ఒక్కసారిగా..

Aug 8 2023 12:12 AM | Updated on Aug 8 2023 1:55 PM

- - Sakshi

మంచిర్యాల: న్యూఢిల్లీ నుంచి చెన్నయ్‌ వెళ్తున్న తమిళనాడు సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో పొగలు వ్యాపించడం కలకలం రేపింది. ఈ ఘట న ఆదివారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. తమిళనాడు సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు బెల్లంపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకోగానే ఎస్‌–3 బోగీ వద్ద క్రమంగా పొగలు రావడంతో ప్రయాణికులు భయపడ్డారు.

వెంటనే రైల్వే అధికారులు రైలును స్టేషన్‌లో ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేయించారు. రైల్వే టెక్నికల్‌ టీమ్‌ నిశితంగా తనిఖీ చేసి ప్రమాదమేమీ లేదని, కేవలం రైలు బ్రేక్‌లు చక్రాలకు గట్టిగా పట్టుకోవడంతో పొగలు వ్యాపించినట్లుగా గు ర్తించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. బ్రేక్‌లను సరి చేసి గంట తర్వాత రైలుకు పచ్చజెండా ఊపారు. దీంతో ప్రయాణికులు, రైల్వే అధికారులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకోగా.. అప్పటివరకు ఏర్పడిన ఆందోళనకు తెరపడింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement