చెన్నూర్: చెన్నూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎరువుల గోదాం వద్ద డీఏ పీ కోసం రైతులు మంగళవారం ఉదయం నుంచి బారులు తీరారు. సొసైటీ అధికారులు రైతులకు ఒక్కో బస్తా చొప్పున డీఏపీ అందజేశారు. సొసైటీకి 240 బస్తాలు రాగా 138 మాత్రమే పంపిణీ చేశారు. మరో 102 బస్తాల డీఏపీ ఉండగా 400మందికి పైగా రైతులు రావడంతో టోకెన్లు జారీ చేశారు. ఈ క్రమంలో టోకెన్ల కోసం రైతులు ఎగబడ్డారు. పోలీ సులు వారిని సర్ది చెప్పి రేపు పంపిణీ చేస్తామని గోదాంను మూసివేయించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. సబ్సిడీ కింద డీఏపీ బస్తా రూ.1,350కు వస్తుండగా ప్రైవేట్‌లో రూ.500 అదనంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వానాకాలం సాగుకు సరిపడా డీఏ పీ సరఫరా చేయాలని కోరుతున్నారు.


