బెల్లంపల్లి: హైదరాబాద్ కేంద్రంగా త్వరలో నిర్వహించనున్న జోనల్ మీట్ క్రికెట్ పోటీల కు క్రీడాకారుల ఎంపిక పోటీలను మంగళవా రం బెల్లంపల్లిలో నిర్వహించారు. ఏఎంసీ క్రీడా మైదానంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలను కాసిపేట ఎస్సై ఆంజనేయులు ప్రారంభించగా, మంచిర్యాల, కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు. అండర్– 23 విభాగంలో క్రీడాకారులను జోనల్ మీట్ కు ఎంపిక చేశారు. ఎంపికై నవారిలో ఎస్. శ్రీకాంత్, యశ్వంత్, సాయిచరణ్, వరప్రసాద్, పవన్‌కుమార్, గోపాల్, వంశీ, సుధీర్, పవన్‌కళ్యాణ్, వినయ్, మనోజ్, సిద్దార్థ, అనిల్‌కుమార్, వర్ధన్, జశ్వంత్, హరీశ్, సతీశ్ ఉన్నారు. అండర్–16, అండర్–19 విభాగా ల్లో క్రీడాకారుల ఎంపిక పోటీలు త్వరలో ఉంటాయని నిర్వాహకులు ప్రకటించారు. కార్య క్రమంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎ.వెంకటేశ్వర్లు, క్యాతన్‌పల్లి సర్పంచ్ శరత్‌కుమార్, ప్రిన్సిపాల్ రాజేశ్, న్యాయవాది సంగీత తదితరులున్నారు.


