అస్తవ్యస్తంగా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి రెండు రేడియాలజిస్ట్ పోస్టులు ఖాళీ అందని ఎక్స్‌రే, స్కానింగ్ సేవలు సదుపాయాలు అంతంత మాత్రమే.. ఇబ్బందులకు గురవుతున్న రోగులు
ఎక్స్‌రే, స్కానింగ్‌కు ఇబ్బందులే..
ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని ఎక్స్‌రే మిషన్ పాడైంది. ఈ విషయం సూపరింటెండెంట్ ఉన్నతాధికారులకు తెలిపి మరమ్మతు ఖర్చులు చెల్లించాల్సి ఉంటుంది. సూపరింటెండెంట్ లేకపోవడంతో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఎక్స్‌రే మిషన్ పనిచేయక, రోగులను అంబులెన్స్‌లో టీహబ్‌కు, మాతా శిశు ఆరో గ్య కేంద్రానికి అంబులెన్స్‌లో తరలించి ఎక్స్ రే తీయిస్తున్నారు. సోమవారం మాతా శిశు ఆరోగ్య కేంద్రంలోనూ ఎక్స్‌రే మిషన్ పనిచేయకపోవడంతో పరీక్షలు అవసరమైనవారిని టీహబ్‌కు తరలించారు. రెండు అంబులెన్స్‌ల్లో ఒకటి పాడు కాగా మరమ్మతుకు నోచుకో వడంలేదు. ఒక్క అంబులెన్స్‌లోనే ఎక్స్‌రే కో సం ముగ్గురు, నలుగురిని కలిపి ఒకేసారి టీహబ్‌కు తరలిస్తున్నారు. టీహబ్‌లో ఒక్కచోటే ఎక్స్‌రే మిషన్ ఉండడంతో, రోగులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ఆ స్పత్రికి సూపరింటెండెంట్‌ను నియమించక పోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. నెల క్రితం ఇద్దరు రేడియాలజిస్ట్‌లు బదిలీపై వెళ్లగా, వా రి స్థానంలో ఒక్కరిని కూడా నియమించలే దు. దీంతో మాతా శిశు ఆరోగ్యకేంద్రంలో గ ర్భిణులకు స్కానింగ్ పరీక్షలు చేయడం ఇ బ్బందికరంగా మారింది. ప్రస్తుతానికి ప్రభు త్వ మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌తో వారంలో ఏదో ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే స్కానింగ్ చేస్తూ నెట్టుకొస్తున్నారు. ఎక్స్‌రే, స్కానింగ్‌కు సంబంధించి రోగులు, గర్భిణులకు పూర్తిస్థాయిలో సేవలు అందడంలేదు. కనీసం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం లేదు. ప్రస్తుతం సీజనల్ వ్యాధుల కా లం కావడంతో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి వ చ్చే రోగుల సంఖ్య పెరుగుతోంది. పూర్తి స్థాయిలో రేడియాలజిస్ట్‌ల నియామకం వెంటనే చేపట్టేలా, రోగులకు సరైన సేవలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలనే డిమాండ్ రోగుల్లో వ్యక్తమవుతోంది.
మూసి ఉన్న స్కానింగ్ గది
మంచిర్యాలటౌన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి పనితీరు అస్తవ్యస్తంగా మారింది. నిర్వహణ సరిగా లేక రోగులు అవస్థలకు గురవుతున్నా రు. ఈ ఆస్పత్రికి జిల్లా వాసులే కాకుండా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాతోపాటు మహారాష్ట్రకు చెంది న రోగులు కూడా నిత్యం వస్తుంటారు. నిత్యం 600 కు పైగా ఓపీ నమోదవుతుండగా, ఆస్పత్రిలోనే ఉంటూ 200 మంది వివిధ రకాల వైద్యసేవలు పొందుతున్నారు. ఈ ఆస్పత్రికి అనుబంధంగా కొనసాగుతున్న మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి నిత్యం 160 మంది వరకు గర్భిణులు వైద్య పరీక్షలకు కోసం వస్తుండగా, 50 మంది వరకు స్కానింగ్ చేయాల్సి వస్తోంది. మెరుగైన వైద్యసేవలు అందుతాయని ఎంతో ఆశతో ఈ ఆస్పత్రికి రోగులు వస్తుండగా పర్యవేక్షణ కొరవడి ఇబ్బందులు పడుతున్నారు.
బదిలీలు జరిగి నైలెనా..
ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో పా టు ఇద్దరు రేడియాలజిస్టులు నెల క్రితం బదిలీ కా గా వారి స్థానంలో ఎవరిని కేటాయించలేదు. ప్రభు త్వ జనరల్ ఆస్పత్రి, మా తా శిశు ఆరోగ్యకేంద్రం, టీహబ్ ఈ మూడింటిని ప ర్యవేక్షించే బాధ్యత ప్రభు త్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై ఉంది. మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుబంధంగా కొనసాగుతున్న ఈ ఆస్పత్రిలో ఏ అవసరం వ చ్చినా వెంటనే తీర్చేందుకు అవసరమైన ని ధులు ఖర్చు చేయడం కో సం చెక్‌పవర్ సూపరింటెండెంట్‌కే ఉంటుంది. ఆస్పత్రి లో రెగ్యులర్‌గా జరుగుతున్న సేవలను ప్రస్తుతానికి ఇ ద్దరు ఆర్‌ఎంవోలు పర్యవేక్షిస్తున్నారు. ఆస్పత్రిలో ఏదైన యంత్రం పాడైతే మరమ్మతులు చేపట్టాల్సి ఉ న్నా, రోగులకు అవసరమైన వాటిని తెప్పించాల న్నా సూపరింటెండెంట్ చేయాల్సి ఉంటుంది. నెల దాటినా సూపరింటెండెంట్‌ను నియమించలేదు. తాజాగా మంగళవారం ప్రభుత్వ వైద్యకళాశాల ప్రొఫెసర్ అశోక్‌కుమార్‌కు ఇన్‌చార్జి సూపరింటెండెంట్ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.


