టిప్పర్ బోల్తాపడి యువకుడు..
ట్రాక్టర్ అదుపుతప్పి వ్యక్తి ..
మద్దూర్(కోస్గి): ట్రాక్టర్ అదుపుతప్పి వ్యక్తి మృతి చెందిన ఘటన కోస్గి మండల పరిధిలో చోటు చేసుకుంది. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన గట్టవోని వెంకటేష్ (40) సొంతంగా ట్రాక్టర్ నడుపుతుండేవాడు. ఈ క్రమలంలో మంగళవారం ఉదయం అదే గ్రామానికి చెందిన ఈడిగి నర్సిములుగౌడ్ వద్ద పత్తి పంటలో కలుపు రొప్పడానికి వెళ్లాడు. పనులు ముగించుకొని ట్రాక్టర్‌పై ఇద్దరు గ్రామానికి వస్తుండగా గ్రామ శివారు చంద్రవంచ– దౌల్తాబాద్ బీటీరోడ్డుపై ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో డ్రైవర్ వెంకటేష్ చేతులు విరిగి తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. పక్కనే ఉన్న నర్సిములుగౌడ్‌కు సైతం గాయాలయ్యాయి. మృతుడి భార్య అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్యతోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఆటో ఢీకొని వ్యక్తి..
మరికల్: ఆటో ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన అర్ధరాత్రి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మహబూబ్‌నగర్‌కు చెందిన మహమ్మద్ సలీం(34) సోమవారం దేవరకద్రలో ఉన్న తన అ క్క దగ్గరకు వచ్చాడు. అక్కడి నుంచి రాత్రి మరికల్‌కు చేరుకొని అర్ధరాత్రి రాయచూర్ రో డ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఆటో ఢీకొట్టింది. గాయపడిన సలీంను చికిత్స నిమిత్తం ఢీకొట్టిన ఆటోలోనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. అనంతరం ఆటో డ్రైవర్ మృతదేహాన్ని ఆత్మకూర్– కన్మనూర్ చౌరస్తా వద్ద ఉన్న కల్వర్టు వద్ద పడేసి పరారయ్యాడు. మంగళవా రం ఉదయం విషయం వెలుగులోకి రావడంతో ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఎస్‌ఐ విక్రమ్ తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
బైక్‌ను బస్సు ఢీకొట్టిన
ఘటనలో వృద్ధుడు ..
అయిజ: మండలం సమీపంలోని కర్నూలు రోడ్డు పై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. మున్సిపాలిటీ పరిధిలోని పర్థిపురానికి చెందిన కిష్టన్న (53) సోమవారం ఆయన కుమార్తె కుమారుడు (మనవడు) ధర్మతేజతో బైక్‌పై వెళ్తుండ గా మండలంలోని వెంకటాపుర స్టేజి సమీపంలో వెనుక నుంచి కర్ణాటక బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో కిష్టన్న తీవ్రంగా గాయపడగా, ధర్మతేజకు స్వల్పగాయాలయ్యాయి. అనంత రం చికిత్స నిమిత్తం కర్నూలు ఆస్పత్రికి తరలించగా కిష్టన్న మృతిచెందాడు. మృతుడికి భార్య ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నా రు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ట్రాలీ ఆటోను ఢీకొట్టిన మినీ బస్సు..
వెల్దండ: మండల కేంద్ర సమీపంలో సోమవా రం రాత్రి ట్రాలీఆటోను మినీ బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ రహిమాన్(32) మృతి చెందినట్లు ఎస్‌ఐ యుగేంధర్‌రెడ్డి తెలిపారు. అచ్చంపేట నుంచి హైదరాబాద్ వెళ్తున్న ట్రాలీ ఆటోను యాదగిరిగుట్ట నుంచి శ్రీశైలం వైపు వెళ్తున్న మినీ బస్సు వెల్దండ సమీపంలో డీకొట్టింది. ప్రమాదంలో ట్రాలీ ఆటో డ్రైవర్ మహ్మద్ రహిమాన్ అక్కడికక్కడే మృతి చెందిగా మరో ఇద్దరు ఉ మార్‌ఖాన్, జహంగీర్ గాయపడ్డారు. క్షతగాత్రుల ను కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా మెరు గైన వైద్యం కోసం హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ట్రాలీ ఆటోలోని వారు హైదరాబాద్‌లోని ఫలక్‌నామకు చెందిన వారిగా ఎస్‌ఐ తెలిపారు. మృతుడి బావమరిది షకీల్ ఫిర్యాదు మంగళవారం మినీ బస్సు డ్రైవర్ హరినాథ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి భార్య రేష్మబేగం, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
బైక్ అదుపుతప్పి నేపాల్ యవకుడు..
కొత్తకోట రూరల్: బైక్ అదుపుతప్పి యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన పాలెం ఎన్‌హెచ్– 44పై సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. నేపాల్‌కు చెందిన తికారాం సేజ్వాల్(21) బెంగుళూర్ నుంచి బైక్‌పై హైదరాబాద్ వెళ్తుండగా మండలంలోని పాలెం సమీపంలో బైక్ అదపుతప్పి కిందపడటంతో తికారాం సేజ్వాల్ అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వనపర్తి మార్చూరీకి తరలించినట్లు ఎస్‌ఐ శివానందం గౌడ్ తెలిపారు.
ఆటో బోల్తా.. ఐదుగురికి గాయాలు
దేవరకద్ర: ఆటో బోల్తాపడిన ప్రమాదంలో ఐదుగురు గాయపడిన ఘటన మంగళవారం మండల కేంద్రంలో జరిగింది. దేవరకద్ర నుంచి కౌకుంట్ల వైపు వెళ్తున్న ఆటో డోకూర్ స్టేజీ సమీపంలో ఈదురుగాలులకు అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. ప్రమాదంలో శైనాజ్ బేగం, శివజ్యోతి, సరి తా, మహబూబ్‌బీ, కలీం గాయపడగా వారిని 108 అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఉమ్మడి జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు
ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందిన ఘటన మంగళవారం జరిగింది. పూర్తి వివరాలు ఇలా..
మక్తల్: ఇసుక టిప్పర్ బోల్తా ప డి మృతి చెందిన ఘటన మండలంలోని మాద న్‌పల్లి శివారు లో మంగళవారం జరిగింది. పూర్తి వివరాలు.. నారాయణ పట మండంల శేర్నపల్లికి చెందిన ఇసుక టిప్పర్ డ్రైవర్ నరేశ్(25) దాసర్‌పల్లి వాగు నుంచి మాదన్‌పల్లికి టిప్పర్‌లో ఇసుక తరలిస్తుండగా అదుపు తప్పి బోల్తాపడటంతో డ్రైవర్ నరేశ్ టిప్పర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తల్లి శంకరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన్నట్లు ఎస్‌ఐ రాజు తెలిపారు.


