ఏషియన్‌ హ్యాండ్‌బాల్‌ పోటీలకు సాయిచరణ్‌రెడ్డి | - | Sakshi
Sakshi News home page

ఏషియన్‌ హ్యాండ్‌బాల్‌ పోటీలకు సాయిచరణ్‌రెడ్డి

Jul 14 2026 1:18 AM | Updated on Jul 14 2026 1:18 AM

మహబూబ్‌నగర్‌ క్రీడలు: జిల్లాలోని మూసాపేట మండలం పొల్కంపల్లి గ్రామానికి చెందిన పుట్టమర్రి సా యిచరణ్‌రెడ్డి అంతర్జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలకు ఎంపికయ్యాడు. హ్యాండ్‌బాల్‌లో ప్రతిభ చూపడంతో చైనా దేశం చుగ్‌హౌలో ఈనెల 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరిగే 19వ ఏషియన్‌ పురుషుల జూనియర్‌ హ్యాండ్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్న భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇటీవల యూపీలోని లక్నో నగ రంలో జరిగిన నేషనల్‌ సెలక్షన్స్‌ ట్రయల్స్‌లో సత్తా చాటడంతో భారత జట్టుకు ఎంపికయ్యాడు. అలాగే ఈ ఏడాది జనవరిలో గుజరాత్‌ రాష్ట్రం సోమ్‌నాథ్‌లో జ రిగిన 69వ స్కూల్‌ గే మ్స్‌ ఫెడరేషన్‌ జాతీయస్థా యి హ్యాండ్‌బాల్‌ చాంపియ న్‌షిప్‌లోనూ పాల్గొన్నాడు.

క్రీడాకారుడికి అభినందనలు

చైనాలో జరిగే ఏషియన్‌ జూనియర్‌ హ్యాండ్‌బాల్‌ చాంపియన్‌షిప్‌కు సాయిచరణ్‌రెడ్డి ఎంపికకావడంపై అసోసియేషన్‌ ప్రతినిధులు రజనికాంత్‌రెడ్డి, ఎండి.జియావుద్దీన్‌ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా క్రీడాకారుడు భారతజట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుండడం సంతోషంగా ఉందన్నారు.ఏషియన్‌ జూనియ ర్‌ హ్యాండ్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో ప్రతిభ చాటి జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement