ఇల్లు పొమ్మంది.. ఊరు రమ్మంది | - | Sakshi
Sakshi News home page

ఇల్లు పొమ్మంది.. ఊరు రమ్మంది

Jul 14 2026 1:18 AM | Updated on Jul 14 2026 1:18 AM

ఎన్నో అవమానాలు భరించా..

ఇద్దరూ చదువుకున్నోళ్లే..

కులాంతర వివాహంతో కుటుంబానికి దూరమైన యువతి

రోడ్డు ప్రమాదంలో భర్త మృతి..

భర్త బంధువుల వేధింపులు

భర్త స్థాపించిన స్కూల్‌ కోసం

అలుపెరగని పోరాటం

గ్రామస్తుల అండతో దక్కిన ఫలితం

రాజోళి: కులాంతర వివాహం చేసుకోవడం.. కన్న తల్లిదంద్రులే కూతురును కాదనుకున్నారు. ఆమెకు చెందిన సామాజికవర్గం కూడా దగ్గరకు రానివ్వలేదు. ఇద్దరు పిల్లలు పుట్టాక కూడా కరుణించలేదు. అయితేనేం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడు కంటికి రెప్పలా చూసుకుంటున్నాడని మురిసిపోయింది.. ఆ ఆశలు కానీ, ఇంతలోనే విధి వక్రీకరించింది. ప్రాణానికి ప్రాణమైన భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటి నుంచి ఆ యువతి కష్టాలు మరింత తీవ్రమయ్యాయి. భర్త తరపు వారు కూడా వేధింపులకు గురిచేయడంతో ఆమె వేదన.. అరణ్యరోదనగా మారిపోయింది.

2017లో కులాంతర వివాహం..

వడ్డేపల్లి మండలంలోని రామాపురం గ్రామానికి చెందిన రేణుక, అదే గ్రామానికి చెందిన విజయ్‌ ప్రేమించుకొని.. 2017లో కులాంతర వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి యువతి అమ్మానాన్నలు ఆమెను కుటంబం నుంచి వెలివేశారు. కనీసం ఇంటి దగ్గరకు కూడా రానివ్వకపోగా.. ఫోన్లో సైతం మాట్లాడటం లేదు. అయితే అప్పటికే జీవితంలో స్థిరపడిన భర్త విజయ్‌ 2012లోనే రామాపురంలో విజ్ఞాన్‌ కాన్సె ప్ట్‌ స్కూల్‌ను స్థాపించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులతో పాఠశాల బాగా నడిచేది. అయితే అప్పటికే విజయ్‌ సోదరుడు, కుటుంబ సభ్యులకు ఆ స్కూల్‌పై కన్ను పడింది. ఈ క్రమంలోనే 2019 మే 11న గ్రామానికి చెందిన ఓ యువకుడి శుభకార్యానికి వెళ్లగా అప్పట్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయ్‌తో సహా 14 మంది మృత్యువాతపడ్డారు. ఈ ఘటనతో భర్త తరపున బంధువులు వేధింపులు మొదలయ్యాయి. విజయ్‌ మృతితో భార్య రేణుకకు రావాల్సిన పథకాలేవి భర్త ఇంటి సభ్యులు ఆమెకు దక్కనివ్వలేదు. భర్త స్థాపించిన స్కూల్‌ను సైతం లాక్కొని వివిధ రకాలుగా వేధింపులకు గురిచేశారు. పాఠశాల లైసెన్స్‌, రిజిస్ట్రేషన్‌ సైతం రేణుక పిల్లల పేరు మీదనే ఉన్నప్పటికీ ఆమెను దరిదాపుల్లోకి రానివ్వ లేదు. అయినప్పటికీ రేణుక తల్లిదండ్రులు ఆమెకు తోడుగా నిలవలేకపోయారు.

ఆ అమ్మాయిని చూసే గ్రామంలో పిల్లల ను బడికి పంపాం. ఆమె భర్త విజయ్‌, అమ్మాయి రేణుక ఇద్దరూ చదువుకున్న వా ళ్లే. ఇతర గ్రామాలకు పంపి ఆలోచన చేసేంటే, తమ కళ్లెదురుగా పిల్లలు చదువుకుంటున్నారని ఆశపడ్డాం. విజయ్‌ చనిపోయాక అమ్మాయికి పాఠశాల రాకుండా ఎలాంటి అనుభవం లేని వ్యక్తి నడిపి పిల్లల భవిష్యత్‌ను నాశనం చేస్తున్నారు. అలాంటి వ్యక్తి నుంచి ఒంటరి యువతకి న్యాయం చేయాలని గ్రామస్తులం నిర్ణయించుకొని అండగా నిలబడ్డాం.

– లక్ష్మీరెడ్డి,

సింగిల్‌ విండో వైస్‌ ప్రెసిడెంట్‌,వడ్డేపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement