వెల్దండ: మండలంలోని రాఘయపల్లిగేట్ సమీపంలో హైదరాబాద్, శ్రీశైలం జాతీయ రహదారిపై ఆదివా రం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం పోలీస్‌స్టేషన్ ఎదుట గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం సామయిపల్లితండాకు చెందిన గ్యానేష్ (28) కారు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందాడు. గ్యానేష్ మృతితో కుటుంబం రోడ్డున పడుతుందని, న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తూ.. హైదరాబాద్, శ్రీశైలం జాతీయ రహదారిపై బైఠాయించారు. వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో పోలీసులకు, బాధిత కుటుంబ సభ్యులకు వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు పోలీసులు నప్పజెప్పడంతో వారు ఆందోళన విరమించారు.
కారు డ్రైవర్ కేసు నమోదు
నారాయణపూర్‌గేట్ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ హనుమంతుపై సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ యుగంధర్‌రెడ్డి తెలిపారు. మృతుడి భార్య దేవి ఫిర్యాదు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.


