బ్రెయిన్‌ స్ట్రోక్‌తో బాలుడు మృతి | - | Sakshi
Sakshi News home page

బ్రెయిన్‌ స్ట్రోక్‌తో బాలుడు మృతి

Jul 24 2023 1:04 AM | Updated on Jul 24 2023 7:26 AM

- - Sakshi

మహబూబ్‌నగర్‌: బ్రెయిన్‌ స్ట్రోక్‌తో బాలుడు మృతి చెందిన సంఘటన మండలంలోని వర్నె గ్రామంలో విషాదాన్ని నింపింది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చిట్టెమ్మ, సహదేవ్‌ దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరిలో రెండో కుమారుడు సుశాంత్‌(15) దేవరకద్ర మండలంలోని పేరూరు జెడ్పీ హైస్కూల్‌లో 7వ తరగతి చదువుతున్నాడు. శనివారం సాయంత్రం ఇంటి వద్ద బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురై ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు.

కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్చిన గంటలోపే ప్రాణాలు వదిలాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నిన్నటి వరకు కుటుంబ సభ్యుల ముందు ఆడుతూ పాడుతూ గడిపిన బాలుడు బ్రెయిన్‌ స్ట్రోక్‌తో మృతి చెందడం ఆ కుటుంబాన్ని తీరని శోకసంద్రంలో ముంచింది.

Advertisement
 
Advertisement
Advertisement