మహబూబాబాద్ రూరల్ : తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన 3.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ హౌస్ ఎదుట తెలంగాణ కాంగ్రెస్‌ల ఫోరం ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టారు. ఈ నిరసనలో ఎంపీ పోరిక బలరాంనాయక్ పాల్గొని మాట్లాడారు. యూరియా పంపిణీపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసి విన్నవించినా.. యూరియా కొరతను తీర్చలేదన్నారు. మంగళవారం పార్లమెంట్లో వాయిదా తీర్మానం ఇస్తామని తెలిపారు. మకర్ ద్వార్ వద్ద నిరసన తెలపనున్నామని, రైతుల హక్కుల కోసం కాంగ్రెస్ పోరాడుతుందని తెలిపారు.
పార్లమెంట్ హౌస్ బయట నిరసన తెలిపిన ఎంపీ బలరాంనాయక్