
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
మహబూబాబాద్: రైతులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మ ల నాగేశ్వర్‌రావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సెక్రటేరియట్ నుంచి సీఎస్ రామకృష్ణారావుతో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు సోమవారం వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా యూరియా కొతర, ఎరువుల లభ్యతపై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ.. యూరియా, ఎరువుల కృత్రిమ కొరత సృష్టించే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. వీడియోకాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, అధికారులు పాల్గొన్నారు.
యూరియా వినియోగంపై అవగాహన
కల్పించాలి : కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్
నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అన్నారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్పరెన్స్ సమావేఽశ మందిరం నుంచి జిల్లాలోని అన్ని మండలాల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, వ్యవసాయ అధికారులతో కలెక్టర్ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ మాట్లాడుతూ.. ఆన్‌లైన్ ద్వారా మాత్రమే యూరియా అమ్మకాలు చేపట్టాలన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకరు యూరియా అమ్మకాలు చేపట్టాలన్నారు. వర్షాలు, వరదలు పెరిగే అవకాశం ఉన్నందున జిల్లా వ్యాప్తంగా అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ మాట్లాడుతూ.. జిల్లాలో రైతులకు ఇబ్బంది కలుగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవన్నారు. వీసీలో డీఏఓ విజయనిర్మల, డీసీఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో
మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు