
పచ్చడి మెతుకులు.. నీళ్లచారు..
మహబూబాబాద్ అర్బన్: సంక్షేమ హాస్టళ్లలో మెనూ పాటించడం లేదు. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో హాస్టళ్ల సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరి స్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని ఎస్సీ సంక్షేమ బాలుర హాస్టల్‌లో మంగళవారం ఉదయం టిఫిన్‌కు బదులు పచ్చడితో అన్నం వడ్డించారు. అదేవిధంగా పోస్ట్‌మెట్రిక్ కళాశాల హా స్టల్‌లో కూడా విద్యార్థులకు టిఫిన్‌కు బదులు నీళ్లచారుతో అన్నం అందించారు. దీనిపై వార్డెన్లను వి వరణ కోరగా విద్యార్థులే అన్నం పెట్టాలని, టిఫిన్లు వద్దని అంటున్నారని వారు తెలిపారు. కాగా, టిఫిన్లు రుచిగా లేకపోవడంతోనే అన్నం పెట్టమని అడుగుతున్నామని విద్యార్థులు తెలిపారు.