
విలీన గ్రామాల్లో సమస్యల తిష్ట..
మహబూబాబాద్ అర్బన్: మానుకోట మున్సిపాలిటీలో ఈదులపూసపల్లి, జమాండ్లపల్లి, ముత్యాలమ్మగూడెం, గాంధీపురం, అనంతారం, బేతోలు, రజాలీపేట, శనిగపురం గ్రామాలతో పాటు తండాలు విలీనమయ్యాయి. ఆయా కాలనీల్లో వీధి కుక్కలు, కోతులు స్వైరవిహారం చేస్తున్నాయి. సరైన సైడ్ డ్రెయినేజీలు లేక మురుగునీరు, దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆయా కాలనీల్లో ఎక్కడ చూసినా చెత్తా చెదారం పేరుకుపోయి అపరిశుభ్రంగా మారాయి. కాలనీ శివారులోని కుంటల్లో నీరు నిల్వ ఉండి చెరువులను తలపిస్తున్నాయి. దీంతో దోమలు, ఈగలకు ఆవాసాలుగా మారాయి. ఇప్పటికై నా జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి విలీన గ్రామాలు, పలు కాలనీల్లో సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.