మహబూబాబాద్: ప్రభుత్వం ప్రతీ నియోజకవర్గానికి రూ.10 కోట్ల స్పెషల్‌డవలప్‌మెంట్ ఫండ్ విడుదల చేసింది. దాంతో నియోజకవర్గంలోని పలు సమస్యలతోపాటు తాగు నీరు, విద్యకు సంబంధించిన పనులు చాలా వరకు పూర్తి చేశారు. నిబంధనల ప్రకారం పలు పనులకు నిధులు కేటాయించారు. ఈనిధుల విడుదలతో ఎమ్మెల్యేలకు కొంత ఊరట లభించినట్లైంది.
జిల్లాలో ఐదు నియోజకవర్గాలు
జిల్లా పరిధిలో ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి. కానీ, మానుకోట, డోర్నకల్ నియోజకవర్గాలు మాత్రమే పూర్తిస్థాయిలో ఉన్నాయి. నియోజకవర్గాలకు 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.10 కోట్ల చొప్పున ప్రభుత్వం కేటాయించింది. సీపీఓ శాఖ నుంచి ఆ పనులకు సంబంధించిన నిబంధనలను ఎమ్మెల్యేలకు అందచేశారు.
ఖర్చు చేయాల్సింది ఇలా..
రూ 6.50 కోట్లు అభివృద్ధి పనులకు ఖర్చు చేయాల్సి ఉంది. రోడ్డులు, డ్రెయినేజీ, వాకింగ్ ట్రాక్, విద్యుత్ దీపాలు ఇతరత్రా పనులు చేయొచ్చు. కోటి రూపాయలు మాత్రం తాగు నీటికి మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంది. రూ.రెండు కోట్లు ఎడ్యుకేషన్‌కు ఖర్చు చేయాలి. రూ.50 లక్షలు ప్రభుత్వ కార్యాలయాలకు ఖర్చు చేయాలనే నిబంధనలను ప్రభుత్వం రూపొందించింది. ఈ నిధుల ఖర్చు, పనులపై ఎమ్మెల్యేలదే పూర్తి అధికారం.
బ్యాలెన్స్ రూ.2.50 కోట్లు
మానుకోట నియోజకవర్గంలో రూ.6.50 కోట్ల పనుల్లో 143 పనులు పూర్తి చేఽశారు. మానుకోట మున్సిపాలిటీ పరిధిలో కూడా రోడ్డులు, డ్రెయినేజీలు, వాకింగ్ ట్రాక్ పనులు చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలుర) ఎన్టీఆర్ స్టేడియంలో వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనులు పూర్తి చేశారు. గ్రామాల్లో కూడా అవే పనులు చేశారు. చాలా వరకు పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు. 143 పనులకు గాను రూ.5.37 కోట్లు ఖర్చు అయినట్లు సీపీఓ అధికారులు పేర్కొన్నారు. ఇంకా రూ.1.13 లక్షల బ్యాలెన్స్ ఉందని తెలిపారు. తాగు నీటికి సంబంధించి కోటి రూపాయలతో పనులు పూర్తి చేశారు. ఎడ్యుకేషన్‌కు రూ.2కోట్లలో రూ.66 లక్షల పనులు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల రూ.50 లక్షల్లో రూ.45 లక్షల పనులు చేశారు. మొత్తం పనులు 189 చేయగా రూ.7.48 కోట్లు ఖర్చు అయ్యాయని రూ.2.52 కోట్ల బ్యాలెన్స్ ఉందని సీపీఓ అధికారులు తెలిపారు.
డోర్నకల్‌లో..
డోర్నకల్ నియోజకవర్గంలో రూ.6.50 కోట్ల పనుల్లో రూ.6.44 కోట్ల పనులు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. తాగు నీటికి సంబంధించి కోటి రూపాయల పనులు పూర్తి చేశారు. ఎడ్యుకేషన్ రూ.రెండు కోట్లలో 45 పనులు పూర్తి చేశారు. బ్యాలెన్స్ లేదు. ప్రభుత్వ కార్యాలయాల రూ.50 లక్షల్లో రూ.35 లక్షల పనులు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. రూ.15 లక్షల బ్యాలెన్స్ ఉంది. మొత్తం 254 పనులు చేయగా రూ.9.79 కోట్ల ఖర్చు అయినట్లు అధికారులు తెలిపారు. మరో రూ.21 లక్షల బ్యాలెన్స్ ఉంది.
మళ్లీ ఎదురుచూపు
2025–26 సీడీఎఫ్ నిధుల కోసం ఎమ్మెల్యేలు ఎదురుచూస్తున్నారు. అవి విడుదలైతే నియోజకవర్గాల్లో పెండింగ్ పనులు చేయొచ్చనే ఆలోచనలో ఉన్నారు. ప్రజలు చిన్న చిన్న సమస్యలు చెప్పినప్పుడు వెంటనే ఎమ్మెల్యేలు పరిష్కరించేందుకు మళ్లీ విడుదల చేసే నిధులు ఉపయోగపడుతాయి.
80 శాతం పనులు పూర్తి
తీరిన పలు సమస్యలు