హరియాణా విద్యార్థినికి మొదటి అడ్మిషన్‌ | - | Sakshi
Sakshi News home page

హరియాణా విద్యార్థినికి మొదటి అడ్మిషన్‌

Aug 19 2025 5:10 AM | Updated on Aug 19 2025 5:10 AM

హరియా

హరియాణా విద్యార్థినికి మొదటి అడ్మిషన్‌

నెహ్రూసెంటర్‌: మహబూబాబాద్‌ ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో 2025–26 విద్యాసంవత్సరానికిగాను ఆల్‌ ఇండియా కోటలో హరియా ణాకు చెందిన వైభవిసోని ఎంబీబీఎస్‌లో మొద టి అడ్మిషన్‌ పొందారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్‌ వెంకట్‌ లకావత్‌ విద్యార్థినికి సోమవారం అడ్మిషన్‌ పత్రం అందజేశారు.

దరఖాస్తుల ఆహ్వానం

తొర్రూరు: స్థానిక కస్తూర్భా బాలికల విద్యాలయంలో ఇంటర్‌లో ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సులో అతిథి అధ్యాపక పోస్టు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రత్యేకాధికారి శైలజ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నర్సింగ్‌లో ఎంఎస్సీ, బీఎస్సీ చేసిన మహిళలు అర్హులని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన వారు ఈ నెల 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఇతర వివరాలకు ఫోన్‌ నంబర్‌ 63010 71295 ద్వారా సంప్రదించాలని కోరారు.

స్థానిక ఎన్నికల్లో

బీజేపీ సత్తాచాటాలి

మహబూబాబాద్‌ అర్బన్‌: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకుని సత్తా చాటాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు వల్లభూ వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో సోమవారం నూతన జిల్లా కమిటీ సభ్యులతో స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు పోటీలో ఉంటారని తెలిపారు. నూతన జిల్లా కమిటీ సభ్యులు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు చీకటి మహేష్‌, గడ్డం అశోక్‌, మదన్‌, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు శ్యామ్‌సుందర్‌శర్మ, చెల్పూరి వెంకన్న, సురేందర్‌, నరసింహారెడ్డి, పద్మ, దేవిక, సింగారపు సతీష్‌, ఇందుభారతి, నాగరాజు, మణిచందన, అశోక్‌, విష్ణువర్ధన్‌, సందీప్‌, సాయికుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

జాతీయస్థాయి కరాటే పోటీల్లో పతకాలు

మహబూబాబాద్‌ అర్బన్‌: జాతీయ స్థాయి కరాటే చాంపియన్‌ షిప్‌ పోటీల్లో మోడల్‌ స్కూల్‌ విద్యార్థినులు పతకాలు సాధించారని పాఠశాల ప్రిన్సిపాల్‌ ఉపేందర్‌రావు తెలిపారు. పతకాలు సాధించిన మానుకోట మున్సిపల్‌ పరిధిలోని అనంతారం మోడల్‌ స్కూల్‌ బాలికలను ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో సోమవారం అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ ఉపేందర్‌రావు మాట్లాడుతూ.. ఇటీవల జనగామ జిల్లాలో నిర్వహించిన 4వ జాతీయ స్థాయి ఓపెన్‌ కరాటే చాంపియన్‌ షిప్‌ పోటీలో పాఠశాల నుంచి పాల్గొన్న బాలికలు 7 బంగారు పతకాలు, రెండు రజత పతకాలు సాధించారని తెలిపారు. కోచ్‌ జావిద్‌, పీడీ సింధువర్మ చేసిన కృషిని కొనియాడారు. కార్యక్రమంలో కరాటే పతకాలు పొందిన విద్యార్థినులు కీర్తన, విష్టవి, రూబిన, నిహరిక, రిశ్విత, దీపా, పావని, గీత, భార్గవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సమ్మక్క సాగర్‌

59 గేట్లు ఎత్తివేత

కన్నాయిగూడెం: మండల పరిధిలోని తుపాకులగూడెం గ్రామ పరిధిలోని సమ్మక్క సాగర్‌ బ్యారేజీకి గోదావరి వరద క్రమేపీ పెరుగుతూ వస్తోంది. బ్యారేజీలోకి ఎగువన ఉన్న సరస్వతీ, లక్ష్మి బ్యారేజీ నుంచి 4,98,280 క్యూసెక్కుల నీటి ప్రవాహం సమ్మక్క సాగర్‌ బ్యారేజీలోకి వచ్చి చేరుతోంది. దీంతో బ్యారేజీ 59 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. బ్యారేజీ నీటిమట్టం సామర్ధ్యం 83 మీటర్లు కాగా ప్రస్తుతం 80.30 మీటర్ల నీటిమట్టం ఉంది.

హరియాణా విద్యార్థినికి మొదటి అడ్మిషన్‌
1
1/3

హరియాణా విద్యార్థినికి మొదటి అడ్మిషన్‌

హరియాణా విద్యార్థినికి మొదటి అడ్మిషన్‌
2
2/3

హరియాణా విద్యార్థినికి మొదటి అడ్మిషన్‌

హరియాణా విద్యార్థినికి మొదటి అడ్మిషన్‌
3
3/3

హరియాణా విద్యార్థినికి మొదటి అడ్మిషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement