
ఖాళీ బిందెలతో నిరసన
కేసముద్రం : వారంరోజులుగా తాగునీరు రాక ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కేసముద్రంవిలేజ్ శివారు చైతన్యనగర్ కాలనీలో సోమవారం ఖాళీ బిందెలతో మహిళలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ సంఘం మండల అధ్యక్షుడు కొమ్ము నాగరాజు, కాలనీవాసులు మాట్లాడుతూ.. చైతన్యనగర్ కాలనీలో వారంరోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయిందని, ఈ విషయంపై పలుమార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తాగునీటిని అందించాలని వారు డిమాండ్ చేశారు. కొమ్ము రమాదేవి, మౌనిక, కలమ్మ, దివ్య, పద్మ, ఎల్లమ్మ, వల్లందాసు ఎల్లమ్మ, అమృత, సంగీత పాల్గొన్నారు.