పండుగ వేళ విషాదం..! రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతురు.. | Father And Daughter Died In A Road Accident In Warangal - Sakshi
Sakshi News home page

పండుగ వేళ విషాదం..! రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతురు..

Oct 23 2023 1:12 AM | Updated on Oct 23 2023 3:41 PM

- - Sakshi

వెంకన్న (ఫైల్‌), అనూష (ఫైల్‌)

సాక్షి, వరంగల్‌: పండగకు ఇంటికి వస్తున్న తండ్రీకూతురు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ ఘటన శనివారం రాత్రి మండలంలోని కిష్టాపురంలో జరిగింది. ఎస్సై విజయ్‌కుమార్‌ కథనం ప్రకారం మండలంలోని మొరిపిరాల గ్రామానికి చెందిన ఓరుగంటి వెంకన్న(50)కు కూతురు అనూష(33) ఉంది. పండుగ నిమిత్తం కూతురు అనూష, అల్లుడు ముంజపల్లి రాజు.. హైదరాబాద్‌ నుంచి తొర్రూరు చేరుకున్నారు.

తొర్రూరు బస్టాండ్‌లో ఉండగా వెంకన్న బైక్‌పై వెళ్లి వారిని తీసుకొస్తున్నాడు. ఈ క్రమంలో వరంగల్‌ వైపు నుంచి వస్తున్న కారు కిష్టాపురం క్రాస్‌ వద్ద బైక్‌ను ఢీకొంది. దీంతో వెంకన్న అక్కడికక్కడే మృతిచెందగా తీవ్రగాయాలపాలైన అనూష, రాజును తొర్రూరులోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ అనూష చికిత్స పొందుతూ మృతిచెందింది. రాజు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. దీంతో పండగపూట ఆ కుటుంబలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై కుటుంబీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై విజయ్‌కుమార్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement