నేడు డయల్‌ యువర్‌ సీఎండీ, ఎస్‌ఈ | - | Sakshi
Sakshi News home page

నేడు డయల్‌ యువర్‌ సీఎండీ, ఎస్‌ఈ

Sep 21 2026 6:41 AM | Updated on Sep 21 2026 6:41 AM

కర్నూలు(అగ్రికల్చర్‌): డయల్‌ యువర్‌ ఏపీఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు కర్నూలు సర్కిల్‌ ఎస్‌ఈ ఆర్‌.ప్రదీప్‌కుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు 8977716661 నంబరుకు ఫోన్‌ చేయవచ్చని పేర్కొన్నారు. కర్నూలు కొత్తబస్టాండు సమీపంలో ఉన్న విద్యుత్‌ భవన్‌లో డయల్‌ యువర్‌ ఎస్‌ఈ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. వినియోగదారులు ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు 7382614308 నంబరుకు ఫోన్‌చేసి సమస్యలు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు.

ఎరువుల లారీ బోల్తా

ఉయ్యాలవాడ: మండల కేంద్రమైన ఉయ్యాలవాడ చిన్న వంక సమీపంలో ఎరువుల లారీ ఆదివారం బోల్తా పడింది. నంద్యాల నుంచి ఉయ్యాలవాడలోని ఒక ఎరువుల దుకాణానికి ఎరువులను తీసుకువస్తున్న తరుణంలో ప్రమాదవశాత్తు అదుపుతప్పి కిందపడింది. లారీలో డ్రైవర్‌, ముగ్గురు హమాలీలు వుండగా, ఒక హమాలీకి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన వారికి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. లారీలోని ఎరువులను హమాలీల సహయంతో బయటకు తీశారు.

అన్నప్రసాద వితరణకు రూ.లక్ష విరాళం

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ పథకానికి ఆదివారం తెనాలికి చెందిన జోన్నలగడ్డ నారాయణమూర్తి రూ.లక్ష విరాళాన్ని దేవస్థాన ఈఓ శ్రీనివాసరావుకు అందజేశారు. విరాళాన్ని అందించిన దాతకు దేవస్థానం తరుపున స్వామివారి శేషవస్త్రాన్ని, లడ్డూప్రసాదాన్ని అందించి సత్కరించారు.

పాముకాటుతో కౌలు రైతు మృతి

కర్నూలు (టౌన్‌): పొలంలో పనులు చేసుకుంటున్న ఓ కౌలు రైతుకు పాముకాటుకు గురై మృతి చెందాడు. కల్లూరు మండలంలోని కోడుమూరు రోడ్డులో ఉన్న డ్రైవర్స్‌ కాలనీకి చెందిన గడకారి చాముండేశ్వరయ్య (42) కల్లూరు ఎస్టేట్‌లోని గోడల ఆంజనేయ స్వామి గుడి సమీపంలో ఉన్న డాక్టర్‌ నాగజ్యోతికి చెందిన 8 ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుని పత్తి పంట సాగు చేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం ఆయన వ్యవసాయ కూలీ బీచుపల్లిని తీసుకొని పొలంలో నీరు పెట్టేందుకు వెళ్లాడు. సాయంత్రం చేనులో నీరు కడుతుండగా ప్రమాదవశాత్తు విషసర్పం ఆయన ఎడమ కాలి మడమపై కాటు వేసింది. సమాచారం తెలుసుకున్న ఆయన భార్య గడకారి ఎల్లా దేవి, కుటుంబ సభ్యులతో కలిసి ఘటన స్థలానికి చేరుకొని వెంటనే చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్యాజువాలిటీ వైద్యులు పరీక్షించి మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement