పెన్షనర్ల ఉద్యమ శంఖారావం | - | Sakshi
Sakshi News home page

పెన్షనర్ల ఉద్యమ శంఖారావం

Sep 28 2026 7:21 AM | Updated on Sep 28 2026 7:21 AM

● ఈ నెల 29, 30 తేదీల్లో నిరాహార దీక్షలు

కర్నూలు(సెంట్రల్‌): తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు శంఖారావం పూరించారు. ఈ నెల 29, 30 తేదీల్లో నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ఆ సంఘం కర్నూలు జిల్లా శాఖ అధ్యక్షుడు కోట్ల లింగం తెలిపారు. కర్నూలులోని గౌరీగోపాల్‌ హాస్పిటల్‌కు ఎదురుగా ఉన్న ధర్నా చౌక్‌లో 24 గంటల మహాధర్నా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పెన్షన్‌ రూల్స్‌ వ్యాలిడేషన్‌ చట్టం– 2025ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే 8వ వేతన సంఘం పరిధిలో పెన్షన్‌ సవరణను చేర్చాలని, మధ్యంతర భృతిని వెంటనే ప్రకటించాలని కోరారు. సమాన హోదాకు సమాన పెన్షన్‌ అమలు చేయాలని, ఫ్యామిలీ పెన్షన్ను మెరుగుపరచాలని కోరుతున్నట్లు చెప్పారు. ఆయా డిమాండ్ల సాధన కోసం చేపట్టే నిరాహార దీక్షలకు పెన్షనర్లు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.

శ్రీగిరిపై భక్తుల రద్దీ

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి వేలాది మంది భక్తులు బారులు దీరారు. ఆదివారం సెలవు రోజును పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. వేకువజామున్నే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూలైన్ల వద్ద బారులుదీరారు. భక్తుల రద్దీతో ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లు నిండిపోయాయి.

నేడు డయల్‌ యువర్‌ సీఎండీ, ఎస్‌ఈ

కర్నూలు(అగ్రికల్చర్‌): డయల్‌ యువర్‌ ఏపీఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు కర్నూలు సర్కిల్‌ ఎస్‌ఈ ఆర్‌.ప్రదీప్‌కుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు 8977716661 నంబరుకు ఫోన్‌ చేసి సమస్యలు వివరించవచ్చని పేర్కొన్నారు. కర్నూలు కొత్తబస్టాండు సమీపంలో ఉన్న విద్యుత్‌ భవన్‌లో డయల్‌ యువర్‌ ఎస్‌ఈ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. వినియోగదారులు ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు 7382614308 నంబరుకు ఫోన్‌చేసి సమస్యలు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు.

డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

ఎమ్మిగనూరురూరల్‌: ఇంట్లో ఉరివేసుకొని డిగ్రీ విద్యార్థి ఆరేకంటి ప్రవళ్లిక(19) ఆదివారం ఆత్మహత్య చేసుకున్నారు. ఏనుగుబాల గ్రామానికి చెందిన ఈ విద్యార్థిని ఎమ్మిగనూరులో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. తండ్రి బజారి కొన్నేళ్ల క్రితం మృతి చెందారు. తల్లి కు టుంబాన్ని పోషిస్తున్నారు. ఆదివారం చర్చికి వెళ్లి వచ్చాక తల్లి, కుమార్తె భోజనం చేశారు. తల్లి పొ లంలో పత్తి పనికి వెళ్లగా ప్రవళ్లిక ఇంట్లో ఉరివేసు కొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియటం లేదు. విచారణ జరుపుతున్నట్లు రూరల్‌ ఎ్‌స్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.

నేడు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌

కర్నూలు(సెంట్రల్‌): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ఉదయం 9.30 గంటలకు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ డాక్టర్‌ ఏ సిరి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజ లు వినతులను సమర్పించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్‌తోపాటు అన్ని మండల, డివిజినల్‌, మునిసిపల్‌ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement