కెరీర్‌లో స్థిరత్వం తర్వాతే మొదటి సంతానం | - | Sakshi
Sakshi News home page

కెరీర్‌లో స్థిరత్వం తర్వాతే మొదటి సంతానం

Sep 28 2026 7:21 AM | Updated on Sep 28 2026 7:21 AM

ఉమ్మడి జిల్లాలో 70 శాతానికి పైగా మహిళలు కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటిస్తున్నారు. చాలా మంది మహిళలు ఒక బిడ్డ జన్మించగానే కు.ని. ఆపరేషన్లు చేసుకుంటున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆశా కార్యకర్తలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా అందించిన సేవల ఫలితంగా చిన్న కుటుంబ భావన బలంగా స్థిరపడింది. చాలా మంది ఉద్యోగాల్లో స్థిరపడిన తర్వాత వివాహం చేసుకుంటున్నారు. కెరీర్‌లో స్థిరత్వం కోసం మొదటి సంతానాన్ని మరింత ఆలస్యం చేస్తున్నారు. ఫలితంగా సహజ గర్భధారణ అవకాశాలపై ప్రభావితం చూపిస్తున్నాయి. ప్రస్తుతం పిల్లలను పెంచాలంటే పెనుభారంగా మారింది. వారికి చదువు చెప్పించడం పెద్ద సవాలు. ప్రైవేటులో వేలకు వేల ఫీజులు, నాణ్యమైన వైద్యం, జీవన వ్యయం భారీగా పెరగడం వంటి విషయాలు ఎక్కువ మంది పిల్లలను పోషించడం భారంగా మారింది. ఈ కారణంతోనే మధ్యతరగతి, దిగువ తరగతి కుటుంబాలు ఎక్కువ మంది పిల్లల కంటే ఒక్కరికే మంచి భవిష్యత్‌ ఇవ్వడం ముఖ్యమనే ఆలోచనకు వస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement