కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వరంగ, ప్రైవేట్, సహకార, గ్రామీణ బ్యాంకులు ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు సమ్మె పాటించనున్నాయి. వారంలో ఐదు రోజుల పనిదినాల విధానాన్ని అమలు చేయాలనే ప్రధానమైన డిమాండ్‌తో ఈ సమ్మె చేస్తున్నట్లు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్ జిల్లా కన్వీనర్ నాగరాజు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బ్యాంకు ఎంప్లాయీస్ పెడరేషన్ యూత్ కౌన్సిల్ మెంబరు అనిల్‌రెడ్డి తెలిపారు. జిల్లా పరిషత్‌లోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు దగ్గర ఈ నెల 28, 29 తేదీల్లో ఉదయం 9.30 గంటలకు నిరసన కార్యక్రమం ఉంటుందని యుఎఫ్‌బీయూ జిల్లా కన్వీనర్ తెలిపారు. ధర్నా చౌక్ దగ్గర 30న ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అయితే మూడు రోజుల పాటు కార్పొరేట్ బ్యాంకులు యథాతథంగా పనిచేస్తాయి.
కేడీసీసీబీ ఎదుట నిరసన
బ్యాంకింగ్‌రంగంలో ఐదు రోజుల పనిదినాల విధానాన్ని వెంటనే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్ అసోసియేషన్( ఏపీసీబీఏ), ఆంధ్రప్రదేశ్ కో–ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అసోషియేషన్ (ఏపీసీసీబీఏ) నేతలు డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా సహకార కేంద్రబ్యాంకు ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. సోమవారం నుంచి మూడు రోజుల పాటు చేపట్టనున్న సమ్మెకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఏపీసీబీఏ నేత పి.రాఘవేంద్ర, (ఏపీసీసీబీఏ నేత విజయసింహారెడ్డి పాల్గొన్నారు. నిరసనకు సీనియర్ అధికారులు పి.రామంజనేయులు, ఉమామహేశ్వరరెడ్డి, సునీల్‌కుమార్ తదితరులు సంఘీభావం ప్రకటించారు.


