పర్యాటక రంగానికి ‘ఏఐ’ ఊతం | - | Sakshi
Sakshi News home page

పర్యాటక రంగానికి ‘ఏఐ’ ఊతం

Sep 28 2026 7:21 AM | Updated on Sep 28 2026 7:21 AM

● జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.సిరి

జ్యోతి ప్రజ్వలన చేస్తున్న కలెక్టర్‌ డాక్టర్‌ ఏ సిరి

నృత్యం చేస్తున్న విద్యార్థినులు

కర్నూలు కల్చరల్‌: పర్యాటక రంగానికి ఏఐ (ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌) మరింత ఊతమిస్తుందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.సిరి తెలిపారు. కలెక్టరేట్‌లోని సునయ ఆడిటోరియంలో ఆదివారం ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో కొండారెడ్డి బురుజు వంటి చారిత్రక ప్రదేశాలు ఉన్నాయన్నారు. వీటితోపాటు మంత్రాలయం, పెద్దతుంబళంలోని జైన దేవాలయం, రామాలయం, ఉరుకుంద తదితర ప్రాంతాలను అనుసంధానించాలన్నారు. ఇందుకు టెంపుల్‌ సర్క్యూట్‌గా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మంత్రాలయానికి బెంగళూరు, బళ్లారి తదితర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇతర పర్యాటక ప్రాంతాలను సందర్శించేలా ప్యాకేజీలను రూపొందించాలన్నారు. ఆన్‌లైన్‌లో ప్రచారం చేస్తే పర్యాటలకు సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందన్నారు. గాజులదిన్నె ప్రాజెక్టు వద్ద రిసార్ట్‌, బోటింగ్‌ తదితర సౌకర్యాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. రాంజల చెరువు, సుంకేసుల బ్యారేజీ ప్రాంతాల్లోనూ పర్యాటక అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయన్నారు. వ్యాసరచన పోటీల్లో విజేతలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చిన విద్యార్థులకు బహుమతులు, మెమెంటో, ప్రశంసా పత్రాలను కలెక్టర్‌ అందజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. కార్యక్రమంలో జిల్లా పర్యాటక సాంస్కృతిక శాఖాధికారి ఎం.ఇ. తిరుమలనాయుడు, సెట్కూరు సీఈవో డాక్టర్‌ కె. వేణుగోపాల్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌ అఽధికారి సురేష్‌, మత్స్య శాఖ అఽధికారి రంగనాథ్‌, ఆర్‌ఐవో లాలప్ప పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement