ఆడపిల్లలమని బాధపడలేదు | - | Sakshi
Sakshi News home page

ఆడపిల్లలమని బాధపడలేదు

Sep 27 2026 1:28 AM | Updated on Sep 27 2026 1:28 AM

మా తల్లిదండ్రులు గోవిందరెడ్డి, శారదాదేవి. మేం నలుగురం ఆడపిల్లలం. అయినా మా తల్లిదండ్రులు అందరూ ఆడపిల్లలే కదా అని ఎప్పుడూ బాధపడలేదు. మా నాన్న ఆలూరులోని డిగ్రీకళాశాలలో అటెండర్‌, మా అమ్మ శిశువిహార్‌లో పనిచేశారు. ఈ రోజుల్లో ఒకరిని చదివించాలంటేనే కష్టం. అలాంటిది మా నలుగురుకి మంచి చదువులు చెప్పించారు. మేం కాలేజీలో ఉన్న నాన్న దగ్గరికి ఎప్పుడు వెళ్లినా మీరు కూడా టీచర్లు కావాలని చెబుతుండేవారు. ఆ మాటలు మా మనసులో ఉండిపోయాయి. నేను మద్దికెరలోని బాలికల ఉన్నత పాఠశాలలో హిందీ టీచర్‌గా, మా సోదరి సరిత ఎమ్మిగనూరులోని బాలుర జూనియర్‌ కళాశాలలో జూనియర్‌ లెక్చరర్‌గా, ఇంకో సోదరి రాజమంజరి అనంతపురం జిల్లా కొత్తచెరువులోని జూనియర్‌ అధ్యాపకురాలుగా పనిచేస్తున్నారు. తల్లిదండ్రులకు జీవితాంతం రుణపడి ఉంటాం. – రాజేశ్వరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement