పేదింట్లో విరిసిన వెన్నెల | - | Sakshi
Sakshi News home page

పేదింట్లో విరిసిన వెన్నెల

Sep 27 2026 1:28 AM | Updated on Sep 27 2026 1:28 AM

పేదింట్లో విరిసిన వెన్నెల

కృష్ణగిరి: పేదరికంలోనూ తల్లిదండ్రులు కుమార్తెను ప్రోత్సహించడంతో ఆ ఇంట్లో వెన్నెల విరిసింది. కృష్ణగిరి మండలం లక్కసాగరం గ్రామానికి చెందిన దాసరి శ్రీనివాసులు, మీనాక్షమ్మలకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూమార్తెలు. వీరు తమకున్న 4.70 ఎకరాల పొలంలోనే వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పొలంలో నీటి కోసం బోర్లు పలుమార్లు వేసి అప్పులు చేశారు. అయినా కుమార్తె పార్వతి చదువును నిర్లక్ష్యం చేయలేదు. తిరుపతిలో సంగీత కళాశాలలో శిక్షణ తీసుకున్న పార్వతి ఒక కార్యక్రమంలో ‘ఊరంతా వెన్నెల.. మనసంతా చీకటి’ అనే పాట పాడగా సంగీత సామ్రట్‌ కోటి మెచ్చుకున్నారు. తన గ్రామానికి బస్సు వేయాలని పార్వతి కోరగా న్యాయనిర్ణేతలు అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళి డోన్‌ నుంచి దేవనకొండ వేళ్లే బస్సును వేశారు. తాను తిరుపతిలోని మ్యూజిక్‌ కాలేజీలో ఐదేళ్లు ఎంఏ పూర్తి చేసి ప్రస్తుతం తిరుపతిలోని బాలజీ కాలనీలో ఉంటున్నట్లు పార్వతి తెలిపారు. అవకాశం దొరికినప్పుడల్లా పాటలు పాడుతున్నానని తెలిపారు. ఈ మధ్య అనుకోని ప్రయాణం, కౌమారం సినిమాలకు పాటలు పాడినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement