టీడీపీ రెడ్‌బుక్ రాజ్యాంగం ఇలాగే అమలు పరుస్తూ పోతే భవిష్యత్తులో బ్లడ్ బుక్ రాజ్యాంగం వస్తుంది జాగ్రత్త! సైకోలుగా తయారై రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు. ఒక కార్యకర్త ఆపదలో ఉండి ‘అన్నా నీవు ఇప్పుడు రాకపోతే పొద్దున్నే నా శవాన్ని చూస్తావ్’ అని ఫోన్ చేస్తే ఎమ్మెల్యేగా వెళ్లి పరామర్శించడం తప్పా? టీడీపీ నాయకులు సైకోలుగా తయారయ్యారు. ఇష్టానుసారంగా బెదిరిస్తే బెదిరిపోయే నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో ఎవ్వరూ లేరు. మా పార్టీ శ్రేణులకు మేమందరం అండగా ఉంటాం.
– సాయిప్రసాద్ రెడ్డి, ఆదోని మాజీ ఎమ్మెల్యే


