గురుశిష్యులు చంద్రబాబునాయుడు, రేవంత్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సీఎంలుగా కొనసాగుతూ రాయలసీమ ప్రాజెక్టును నీరుగారుస్తున్నారు. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతో నాలుగు టీఎంసీల సామర్థ్యం ఉన్న అవుకు రిజర్వాయర్‌లో రెండు టీఎంసీల నీరు నిల్వ చేసుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. రిజర్వాయర్‌కు పడిన గండికి ఇప్పటి వరకు మరమ్మతులు చేపట్టలేక పోవడం సిగ్గు చేటు. గోరుకల్లు రిజర్వాయర్‌లో 13 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉన్నా కట్ట కుంగి 8–9 టీఎంసీల నీరు నిల్వ చేసుకోలేని పరిస్థితి నెలకొంది. ఇటీవలచంద్రబాబునాయుడు బనగానపల్లె పర్యటనలో కాల్వలు ఏర్పాటు చేసి ఆదుకోవాలని మంత్రి బీసీ.. సీఎం దృష్టికి తీసుకెళ్లినా ఏ మాత్రం స్పందించలేదు. నాలుగుసార్లు సీఎంగా చేసిన బాబు సీమ పెండింగ్ ప్రాజెక్ట్‌లను పూర్తి చేయలేకపోయారు. ఆయన అధికారంలోకి వచ్చారంటే తప్పకుండా కరువు వస్తుంది. – కాటసాని రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బనగానపల్లె


