ఆగస్టు 15లోపు వంద సీజనల్‌ హాస్టళ్లు | - | Sakshi
Sakshi News home page

ఆగస్టు 15లోపు వంద సీజనల్‌ హాస్టళ్లు

Aug 5 2026 1:53 AM | Updated on Aug 5 2026 1:53 AM

ఆగస్టు 15లోపు వంద సీజనల్‌ హాస్టళ్లు ఎల్‌ఎల్‌బీ పరీక్షలకు 37 మంది గైర్హాజరు

కర్నూలు(సెంట్రల్‌): జిల్లాలో వలస వెళ్లిన కుటుంబాల్లో ఒక్క విద్యార్థి కూడా విద్యకు దూరం కాకుండా ఆగస్టు 15వ తేదీలోపు వంద సీజనల్‌ హాస్టళ్లను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ప్రవేశాలు, డ్రాపౌట్ల సంఖ్యపై కలెక్టర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాలులో కలెక్టర్‌ విద్యాశాఖ అధికారులు, స్టేక్‌ హోల్డర్లతో హై లెవల్‌ కమిటీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి మండల విద్యాశాఖాధికారి తమ పరిధిలోని అన్ని పాఠశాలలను పర్యవేక్షించడంతోపాటు పనితీరు సక్రమంగా లేని ప్రధానోపాధ్యాయులను గుర్తించాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే పాలనా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో బాలికల డ్రాపౌట్లు అధికంగా ఉండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. వలస వెళ్లే కుటుంబాల పిల్లలు విద్యకు దూరం కాకుండా సీజనల్‌ హాస్టళ్ల ఏర్పాటును వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో రీజినల్‌ జేడీ శామ్యూల్‌, డీఈఓ జి.సుధాకర్‌, సమగ్ర శిక్ష అభియాన్‌ ప్రాజెక్టు డైరక్టర్‌ డాక్టర్‌ లోకరాజు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి

కర్నూలు(అర్బన్‌): జిల్లాలోని 9 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 13 మెయిన్‌ అంగన్‌వాడీ కార్యకర్తలు, 64 ఆయా పోస్టుల నియామకానికి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా శిశు సంక్షేమ సా ధికారత అధికారిణి పి.విజయ తెలిపారు. కార్యకర్త పోస్టుకు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని, ఆయా పోస్టులకు 7వ తరగతి పాస్‌ కావాలన్నా రు. అభ్యర్థుల వయస్సు 2026 జూలై 1వ తేది నాటికి 21 సంవత్సరాలు నిండి 35 సంవత్సరాల్లోపు ఉండాలని, వివాహమై అదే గ్రామ నివాసి తులు అర్హులన్నారు. ఖాళీలలో కొన్నింటికి హైకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ఈ పోస్టు ల్లో నియమించిన అభ్యర్థుల నియామకం భవిష్యత్తులో వెలువడే కోర్టు ఉత్తర్వులపై ఆధారపడి ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు సీడీపీఓ/కర్నూలు కలెక్టరేట్‌లోని జిల్లా మహిళా శిశు అభివృద్ధి సాధికారత అధికారిణి కార్యాలయాల్లో సంప్రదించాలన్నారు. దరఖాస్తులను ఆయా సీడీపీఓ కార్యాలయాల్లో ఈ నెల 5 నుంచి 13వ తేదీ లోగా కార్యాలయ పనిదినాల్లో అందించాలన్నారు.

బ్యాలెట్‌ పేపర్ల వివరాలు కోరిన సీపీఆర్‌

కర్నూలు(అర్బన్‌): గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి బ్యాలెట్‌ పత్రాలకు ఎంత పేపర్‌ అవసరమవుతుందనే వివరాలను పంపాలని కమిషనర్‌ ఆఫ్‌ పంచాయతీ రాజ్‌ నుంచి ఆదేశాలు జారీ అయినట్లు జిల్లా పంచాయతీ అధికారి జి.భాస్కర్‌ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వారం రోజుల క్రితం ఎన్నికల నిర్వహణకు ఎన్ని బ్యాలెట్‌ బాక్సులు అవసరమవుతాయనే వివరాలను పంపించామన్నారు. తాజాగా బ్యాలెట్‌ పత్రాల వివరాలను కోరిందన్నారు. వార్డు సభ్యులకు తెలుపు, సర్పంచు స్థానాలకు పింక్‌ కలర్‌ పేపర్‌ను వినియోగిస్తామన్నారు. జిల్లాలో మొత్తం 484 గ్రామ పంచాయతీలకు 237 మజరా గ్రామాలు ఉన్నాయన్నారు. అన్ని గ్రామ పంచాయతీల్లో 5,100 వార్డులు ఉన్నాయన్నారు.

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తులు

కర్నూలు సిటీ: అన్ని యాజమన్యాలకు చెందిన ఉపాధ్యాయులు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యా య అవార్డుకు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ ఎల్‌.సుధాకర్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు అర్హులని, ఎలాంటి నేరారోపణలు, అభియోగాలు ఉండకూడదన్నారు. అవార్డుకు ప్రతిపాదనలతో పాటు, అభ్యర్థిపై ఎలాంటి సివిల్‌, క్రిమినల్‌ కేసులు లేవని ధ్రువీకరణ పత్రాలను తనిఖీ అధికారులు జతచేయాలన్నారు. గతంలో జిల్లా స్థాయి ఉత్తమ అవార్డు పొందని వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 15లోపు దరఖాస్తులను డిప్యూటీ విద్యాధికారి కార్యాలయంలో అందజేయాలన్నారు.

కర్నూలు కల్చరల్‌: రాయలసీమ విశ్వ విద్యాలయం పరిఽధిలో నిర్వహిస్తున్న ఎల్‌ఎల్‌బీ రెండో సెమిస్టర్‌ పరీక్షలకు మంగళవారం 37 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు వర్సిటీ పరీక్షల విభాగం డీన్‌ ప్రొఫెసర్‌ నాగస్వరం నరసింహులు తెలిపారు. రెండు పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరగ్గా 453 మంది విద్యార్థులకు గాను 416 మంది హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement