విద్యుదాఘాతంతో మెకానిక్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో మెకానిక్‌ మృతి

Aug 5 2026 1:53 AM | Updated on Aug 5 2026 1:53 AM

కొలిమిగుండ్ల: మండల పరిధిలోని బెలుం శింగవరంలో విద్యుదాఘాతంతో మోటార్‌ మెకానిక్‌ మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి.. గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఉన్న తాగునీటి బోరుకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో సరిచేసేందుకు మెకానిక్‌ కంబయ్య (45) అక్కడున్న స్తంభాన్ని ఎక్కాడు. ఆ సమయంలో తీగ తెగి స్తంభంపైనున్న కాసారంపై పడటంతో విద్యుత్‌ షాక్‌కు గురై పైనుంచి కింద పడ్డాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం అవుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ నగీనా ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. మృతుడు కంబయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement