ఉలిందకొండ పీఎస్‌ను తనిఖీ చేసిన ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

ఉలిందకొండ పీఎస్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

Aug 5 2026 1:53 AM | Updated on Aug 5 2026 1:53 AM

కర్నూలు: ఉలిందకొండ పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నమోదైన కేసుల్లో పెండింగ్‌ కేసులు, వాటి స్థితిగతులు, నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తు, వాటి పురోగతిపై కేసుల ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. మహిళల రక్షణ చట్టాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాల నిర్వహణను అడిగి తెలుసుకున్నారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. ప్రాపర్టీ కేసులను ఛేదించి రికవరీ శాతం పెంచాలని అధికారులకు సూచించారు. ఎస్పీ వెంట కర్నూలు రూరల్‌ సీఐ చంద్రబాబు నాయుడు, ఎస్‌ఐ నిరంజన్‌ రెడ్డి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement