కర్నూలు(సెంట్రల్): తాగునీటిని పరీక్షించిన తరువాతే సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ మనోహర్‌ను ఆదేశించారు. సోమవారం ఢిల్లీ నుంచి కేంద్ర జల్ జీవన్ అడిషనల్ సెక్రటరీ కమల్ కిశోర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలో జరుగుతున్న జల్‌జీవన్ మిషన్ పథకం పనులపై సమీక్షించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ మనోహర్ తదితరులు హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం జిల్లాలోని తాగునీటి సరఫరా అంశాలపై కలెక్టర్ ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్షించారు. ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా పారిశ్రామిక వాడలకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో, డంపింగ్ యార్డులకు దగ్గర ఉన్న ప్రాంతాల్లో నీటి పరీక్షలు చేయాని, అలాగే చెరువులు, చెక్‌డ్యాంలు, బోరు బావుల్లోని నీటిని పరీక్షించిన తరువాతే స్వచ్ఛమైనవిగా తేలితేనే సరఫరా చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో ఉన్న నీటిని సద్వినియోగం చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
పేకాటరాయుళ్ల అరెస్టు
కల్లూరు: పేకాట ఆడుతున్న నలుగురిని అరెస్టు చేసినట్లు ఉలిందకొండ ఎస్‌ఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. సోమవారం మండలంలోని ఉలిందకొండ గ్రామ సమీపంలోని రైల్వే బ్రిడ్జి పక్కనున్న మునిస్వామి తోటలో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ.7,700 నగదు సాధ్వీనం చేసుకొని కేసు నమోదు చేశామని ఎస్‌ఐ వివరించారు.


