జాబ్‌కార్డు ఇవ్వలేదు | - | Sakshi
Sakshi News home page

జాబ్‌కార్డు ఇవ్వలేదు

Oct 5 2026 3:56 AM | Updated on Oct 5 2026 3:56 AM

జాబ్‌కార్డు ఇవ్వలేదు మూడు నెలలుగా ఉపాధి పనులు లేవు వలస వెళ్తాం

కరువు పరిస్థితుల్లో ఉపాధి పనులకు వెళ్లాలని రెండు నెలల కిత్రం జాబ్‌కార్డుకు దరఖాస్తు చేసుకున్నా. ఇంతవరకు ఇవ్వలేదు. ఏమని అడిగితే రూ.2,000 నుంచి రూ.3,000 వరకు ఇవ్వాలంటున్నారు. గతంలో ఎప్పుడూ ఇలా చేయలేదు. జాబ్‌కార్డుకు డబ్బులు తీసుకోవడం బాధ కలిగిస్తోంది.

– ఆదిశేషయ్య, ఎన్‌.వెంకటాపురం,

వెల్దుర్తి మండలం

మా పంచాయతీలో మూడు గ్రామాలు ఉన్నాయి. ఇప్పటి వరకు పంటలు పండలేదు. కూలీలు అందరూ వలస వెళ్లారు. అయినా మూడు నెలలుగా ఉపాధి పనుల జాడే లేదు. ఈ దిశగా చర్యలు తీసుకోలేదు. ఉపాధి పనులు లేకపోతే వలస వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం. – పల్లి ఈరన్న, వన్నూరు,

హొలగొంద మండలం

ఖరీఫ్‌లో నేను రెండు ఎకరాల మెట్ట పొలంలో చౌళేకాయలు సాగు చేశా. గతేడాది ఎకరాకు 50 ప్యాకెట్లు దిగుబడి వచ్చింది. ఈ సారి ఎకరాకు 15కేజీల ప్యాకెట్లు పది వచ్చాయి. పైగా వాటికి ధర లేకపోవడంతో కూలీలకు చేతి నుంచి డబ్బులు ఇచ్చా. ఈసారి పూర్తిగా నష్టం వచ్చింది. దసరా అయిన తరువాత కుటుంబంమంతా వలస వెళ్లి తీరుతాం.

– సుధాకర్‌ రైతు యాటకల్లు గ్రామం,

ఆస్పరి మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement