● వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి
ఎం. సుభాష్ చంద్రబోస్
కర్నూలు(అర్బన్): రాష్ట్ర ప్రభుత్వం తమపై నమోదు చేసే తప్పుడు కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటామని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ ఎం సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఈ ఏడాది ఆగస్టు 13న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలుకు వచ్చిన సందర్భంగా సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారనే ఆరోపణపై నాల్గో పట్టణ పోలీసులు సుభాష్‌ను మొద టి ముద్దాయిగా చేరుస్తూ కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే 41ఏసీఆర్‌సీపీ కింద 4వ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం సుభాష్‌ను స్టేషన్‌కు పిలిపించి నోటీస్‌లో సంతకాలు తీసుకొని సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా సుభాష్ మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై మరింత పట్టుదలతో ఉద్యమాలు చేపడతామన్నారు. వైఎస్సార్‌సీపీలో చురుగ్గా పాల్గొంటున్నందు వల్లే తనపై తప్పుడు కేసు నమోదు చేశారని ఆరోపించారు. అక్రమ కేసులకు భయపడేది లేదని, న్యాయ పరంగా ఆయా కేసులను ఎదుర్కొంటామన్నారు.


