కుటుంబ వ్యవస్థలోనే భారతీయ ఆత్మ | - | Sakshi
Sakshi News home page

కుటుంబ వ్యవస్థలోనే భారతీయ ఆత్మ

Oct 5 2026 3:56 AM | Updated on Oct 5 2026 3:56 AM

● వీహెచ్‌పీ జాతీయ సంయుక్త కార్యదర్శి కప్పగంతుల కోటేశ్వర శర్మ

కర్నూలు కల్చరల్‌: కుటుంబ వ్యవస్థలోనే భారత దేశ ఆత్మ ఉందని విశ్వ హిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) న్యూఢిల్లీ జాతీయ సంయుక్త కార్యదర్శి కప్పగంతుల కోటేశ్వర శర్మ అన్నారు. శ్రధేయ అశోక్‌ సింఘాల్‌ శత జయంతిని పురస్కరించుకొని ఆదివారం కర్నూలులోని వీఆర్‌ కాలనీలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కల్యాణ మండపంలో విశిష్ట వ్యక్తుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కోటేశ్వర శర్మ మాట్లాడుతూ.. శ్రీరామ జన్మభూమిలో భవ్య రామమందిరాన్ని నిర్మించడానికి శ్రధేయ అశోక్‌ సింఘాల్‌ ప్రధానమైన భూమిక పోషించారన్నారు. వీహెచ్‌పీ విస్తరణ, వివిధ విభాగాలను ప్రవేశ పెట్టారని గుర్తు చేశారు. బానిస కాలంలో ఇప్పటి అస్పృశ్యత వచ్చిందని, దాన్ని తొలగించేందుకు సామాజిక సమరసత విభాగం ప్రారంభించారన్నారు. కేంద్రీయ మార్గదర్శక మండలి సదస్యులు తిరుపతి స్వరూపానంద స్వామి, అచలానంద ఆశ్రమం విరజానంద స్వామి, కడప తిరియానంద స్వామీ తదితరులు ప్రసంగం చేశారు. వీహెచ్‌పీ భాగ్యనగర్‌ క్షేత్ర కార్యదర్శి తనికెళ్ల సత్య రవికుమార్‌, దక్షిణాంధ్ర ప్రాంత అధ్యక్షులు యర్రం విష్ణువర్థన్‌ రెడ్డి, కేంద్రీయ కార్యకారిణి సదస్సులు ఎక్కాలి రాఘవులు, ప్రాంత కార్యదర్శి పర్రె కోటేశ్వర రావు మాట్లాడారు. అంతకు ముందు అశోక్‌ సింఘాల్‌ జీవిత చరిత్ర దృశ్య మాలికను అతిథులు ప్రారంభించి వీక్షించారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ ప్రాంత ఉపాధ్యక్షులు మురళమ్మ, శ్రీనివాస నాయుడు, ఏపీ సంఘటనా కార్యదర్శి శ్రీనివాసులు రెడ్డి, సహకార్యదర్శి ప్రాణేష్‌, జిల్లా అధ్యక్షులు టీసీ మద్దిలేటి, వివిధ జిల్లాల వీహెచ్‌పీ నేతలు, విశిష్ట వ్యక్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement