బతుకుదెరువుకు వచ్చి మృత్యువాత | - | Sakshi
Sakshi News home page

బతుకుదెరువుకు వచ్చి మృత్యువాత

Jul 30 2026 4:42 AM | Updated on Jul 30 2026 4:42 AM

● బైక్‌ను ఐచర్‌ లారీ ఢీకొట్టడంతో యువకుడి దుర్మరణం ● మరొకరికి తీవ్ర గాయాలు

● బైక్‌ను ఐచర్‌ లారీ ఢీకొట్టడంతో యువకుడి దుర్మరణం ● మరొకరికి తీవ్ర గాయాలు

మంత్రాలయం రూరల్‌: బతుకుదెరువు కోసం వెళుళూ ఆస్పరికి చెందిన యువకుడు చాకలి రాఘవ (19) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని కల్లుదేవకుంట సమీపంలో ప్రాథమిక ఆరోగ్య శాలకు 100 మీటర్ల దూరంలో ఉన్న కల్వర్టు వద్ద బుధవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో జరిగింది. హెడ్‌కానిస్టేబుల్‌ అంజనేయులు తెలిపిన వివరాల మేరకు.. ఆస్పరి నుంచి చాకలి రాఘవ, మాల లాలప్ప సెంట్రింగ్‌ పనుల కోసం స్కూటర్‌ (ఏపీ 39 ఎఫ్‌సీ 0520)పై మంత్రాలయంకు బయలుదేరారు. మంత్రాలయం వైపు నుంచి వస్తున్న కర్ణాటకకు చెందిన ఐచర్‌ (కేఏ 09 ఏఏ 4672) లారీ అతివేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో చాకలి రాఘవ అక్కడికక్కడే మృతిచెందాడు. వెనుక కూర్చున్న లాలప్పకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement