కర్నూలు(అర్బన్): ఏపీ పంచాయతీరాజ్ ఇంజినీర్స్ అసోసియేషన్ జిల్లా నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఆర్ సతీష్‌కుమార్, జీ ధనిబాబు, ఉపాధ్యక్షులుగా ఎం శేషయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన ఈ నాగిరెడ్డి, ఉపాధ్యక్షులు ఎస్ చంద్రశేఖర్ ఇటీవలే ఈఈలుగా పదోన్నతి పొంది ఇతర జిల్లాలకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం సాయంత్రం స్థానిక కార్యాలయంలో జరిగిన అసోసియేషన్ సమావేశంలో ఈఈలుగా పదోన్నతిపై వెళ్తున్న వారి స్థానంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. పీఆర్ ఈఈ శివనాగిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు వీవీ మురళీక్రిష్ణనాయుడు, జిల్లా గౌరవాధ్యక్షులు వీ రవీంద్రరెడ్డి, డీఈఈలు కర్రెన్న, నాగరాజు, ఏఈఈఈలు జ్యోత్స్న, అమర్‌నాథ్, మురళీ, రాఘవేంద్ర, మంజుల తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సతీష్‌కుమార్, ధనిబాబు మాట్లాడుతూ అసోసియేషన్‌ను జిల్లాలో బలోపేతం చేస్తామన్నారు.


