బలిజ, కాపుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

బలిజ, కాపుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి

Jul 27 2026 1:54 AM | Updated on Jul 27 2026 1:54 AM

కర్నూలు(అగ్రికల్చర్‌): బలిజ, కాపుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని రాయల అఫీషియల్స్‌ ప్రొఫెషనల్‌ అసోసియేషన్‌( రోపా) నాయకులు పేర్కొన్నారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి చెందిన నేపథ్యంలో ఆయన చిత్రపటానికి ఆదివారం కర్నూలు నగరంలోని సాయివసంత్‌ కాంప్లెక్స్‌లో పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీజీవీ కళా క్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య మాట్లాడుతూ...కాపు జాతికి రిజర్వేషన్లు అమలు చేసేందుకు అలుపెరగని పోరాటం చేసి ముద్రగడ ఆదర్శప్రాయులయ్యారని పేర్కొన్నారు. రోపా అధ్యక్షుడు చింతలపల్లి రామకృష్ణ మాట్లాడుతూ ముద్రగడ చేపట్టిన ఉద్యమం ఫలితంగానే ప్రభుత్వం కాపు, బలిజ సామాజిక వర్గానికి కార్పొరేషన్‌ ఏర్పాటు చేసిందన్నారు. జస్టిస్‌ మంజునాథ్‌ కమిటీ సిఫారస్సు మేరకు కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రోపా ప్రధాన కార్యదర్శి కోనేటి వెంకటేశ్వర్లు, కోశాధికారి పెద్దస్వామి, తులసి సీడ్స్‌ ఆధినేత రామచంద్రప్రభు, ఇతర సభ్యులు దివాకర్‌రావు, కామిని వెంకటేశ్వర్లు, శ్రీకాంత్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement