ఓర్వకల్లు మండంలోని రాతివనం సంభ్రమాశ్చర్యం. నిత్యం వందలాది మంది పర్యాటకులతో రద్దీగా ఉండే ప్రదేశం. ఇలాంటి పర్యాటక ప్రాంతంలో సమాచారం అందించే బోర్డులో అధికారుల పేర్లు తప్పుగా ఉన్నాయి. టూరిజం శాఖ అధికారిగా తిరుమల నాయుడు ఉండగా మరో పేరు దర్శనమిస్తోంది. గత జిల్లా కలెక్టర్ రంజిత్‌బాషా పేరు ఇదే బోర్డులో కనిపిస్తోంది. కనీసం అధికారుల పేర్లు కూడా మార్చలేని పనిలో టూరిజం శాఖ వారు ఉన్నారా అని పర్యాటకులు ప్రశ్నిస్తున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు


