నంద్యాల(వ్యవసాయం): ఆధునిక వైద్య విధానాలపై డాక్టర్లకు అవగాహన అవసరమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ వేణుగోపాలరెడ్డి, రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ పరిశీలకులు డాక్టర్ సింగరి ప్రభాకర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఈఎన్‌టీ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని మధుమణి నర్సింగ్ హోమ్‌లో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి ఈఎన్‌టీ వైద్య వైజ్ఞానిక సదస్సు, శస్త్ర చికిత్సల శిక్షణ కార్యశాల ( వర్క్ షాప్) ఆదివారం ముగిసింది. నిర్వాహకులు డాక్టర్ మధుసూదనరావు, డాక్టర్ నాగమణి, డాక్టర్ మణిదీప్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆరు రాష్ట్రాల నుంచి 170 మంది చెవి, ముక్కు, గొంతు వైద్యులు హాజరయ్యారు. పోటీ ప్రపంచంలో రాణించాలంటే యువ వైద్యులు నిరంతరం ఆధునిక విధానాలను నేర్చుకుని నైపుణ్యాలు పెంచుకోవాలని సదస్సు నిర్వాహక చైర్మన్ డాక్టర్ మధుసూదనరావు, డాక్టర్ రవికృష్ణ అన్నారు. ముగింపు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఈఎన్‌టీ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాశ్‌రెడ్డి, వైద్యులు అహిలస్వామి, నాగమణి, రోహిత్, లోచన రెడ్డి, మధుప్రీతి, ప్రణీత్, సింధు తదితరులు పాల్గొన్నారు.


