మాజీ సైనికులకు ఉచిత న్యాయ సేవలు | - | Sakshi
Sakshi News home page

మాజీ సైనికులకు ఉచిత న్యాయ సేవలు

Jul 26 2026 2:44 AM | Updated on Jul 26 2026 2:44 AM

కర్నూలు(అర్బన్‌): మాజీ సైనికులకు ఉచిత న్యాయ సేవలు అందిస్తామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి అన్నారు. శనివారం స్థానిక బి.క్యాంప్‌లోని జిల్లా సైనిక్‌ వెల్ఫేర్‌ కార్యాలయంలో జూలై 26న కార్గిల్‌ దివస్‌ సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సైనికుల కోసం లీగల్‌ సర్వీసెస్‌ క్లీనిక్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఇందులో న్యాయవాదితో పాటు ప్యారా లీగల్‌ వలంటీరు ఉంటారన్నారు. మాజీ సైనికులకు చట్టబద్ధమైన సమస్యలు ఉంటే ఉచిత న్యాయాన్ని అందించి పరిష్కరిస్తామన్నారు. ఇందుకోసం లీగల్‌ సర్వీసెస్‌ టోల్‌ ఫ్రీ హెల్ప్‌ లైన్‌ నెంబర్‌ 15100కు ఫోన్‌ చేయాలన్నారు. ఈ సందర్భంగా మాజీ సైనికులకు వీర్‌ పరివార్‌ లీగల్‌ ఎయిడ్‌ కార్డ్స్‌ను జడ్జి అందించారు. కార్యక్రమంలో జిల్లా సైనిక్‌ వెల్ఫేర్‌ ఇన్‌చార్జి అధికారి మహేంద్రమ్మ, లీగల్‌ ఎయిడ్‌ న్యాయవాది విజయలక్ష్మి, ప్యారా లీగల్‌ వలంటీరు మదుసూధన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement