వాటర్‌ గ్రిడ్‌ పనుల్లో కదలిక | - | Sakshi
Sakshi News home page

వాటర్‌ గ్రిడ్‌ పనుల్లో కదలిక

Jul 24 2026 1:09 AM | Updated on Jul 24 2026 1:09 AM

బుగ్గన పాదయాత్ర అనంతరం

అధికారుల్లో చలనం

డోన్‌: గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి రూ.400 కోట్లతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వాటర్‌ గ్రిడ్‌ పనుల్లో కదలిక మొదలైంది. గోరుకల్లు నుంచి నియోజకవర్గంలోని అన్నీ గ్రామాలకు శుద్ధ జలాన్ని అందించే వాటర్‌ గ్రిడ్‌ పనుల్లో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. పనులు నిలిచిపోవడంతో నిరసగా నెల క్రితం మాజీ మంత్రి బుగ్గన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో కలసి బేతంచెర్ల నుంచి శుద్ధ జలం ప్లాంట్‌ ఉన్న బుగ్గానిపల్లె వరకు పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఈ పాదయాత్ర తర్వాత అధికారులు పైప్‌లైన్‌ పనులను వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో గోరుకల్లు నుంచి డోన్‌ మండలం దేవరబండ వరకు అధికారులు చేపట్టిన నీటి సరఫరా ట్రయల్‌ రన్‌ గురువారం విజయవంతమైంది. గ్రామ శివారులో పైప్‌లైన్‌ ద్వారా ఎగసిపడుతున్న నీటిని అదుపు చేసేందుకు సిబ్బంది ప్రెషర్‌ వాల్వ్‌ను అమర్చారు. మాజీ మంత్రి పాదయాత్ర ఫలితంగా త్వరలోనే ప్యాపిలి మండల ప్రజలకు కూడా శుద్ధ జలం అందే అవకాశాలు మెరుగుపడనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement