జూనియర్ కళాశాలలకు
ఎగనామం
మిల్లెట్స్ చిక్కీ పేరుతో పోషక విలువలు, తూకంలో కోత
మచిలీపట్నంఅర్బన్: జిల్లాలో బడి పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నామంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి, పంపిణీ చేస్తున్న చిక్కీల పరిస్థితి విరుద్ధంగా ఉంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మిల్లెట్స్ చిక్కీల పేరుతో హాస్టల్ విద్యా ర్థులకు ‘న్యూ గుడ్ థింగ్స్ మల్టీ మిల్లెట్ పీనట్ బార్’, పాఠశాలల విద్యార్థులకు ‘ట్రూ గుడ్ పీనట్ మిల్లెట్ చిక్కీ’ అంటూ ప్యాకింగ్ మార్చి పంపిణీ చేస్తున్నారు. గతంతో పోలిస్తే చిక్కీల బరువు, వాటిలో ప్రోటీన్, ఫైబర్ వంటి పోషకాలు తగ్గిపో యాయి. పాఠశాలలు, హాస్టళ్లలో అందించే పౌష్టికాహారం బక్కచిక్కిపోగా, జూనియర్ కళాశాలల విద్యార్థులకు అసలు చిక్కీలు పంపిణీచేయకపోడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బరువు తగ్గి, పోషకాలు తగ్గి..
గత ప్రభుత్వంలో పాఠశాలలు, క్రీడా శిక్షణ కేంద్రాల్లో 25 గ్రాముల పీనట్ జాగరీ చిక్కీలను పిల్లలకు పంపిణీచేసేవారు. ఆ 25 గ్రాముల చిక్కీలో 4.25 గ్రాముల ప్రోటీన్, 1.54 గ్రాముల ఫైబర్ ఉండేవి. ప్రస్తుతం హాస్టళ్లలో పంపిణీ చేస్తున్న 20 గ్రాముల మిల్లెట్ పీనట్ బార్‌లో మూడు గ్రాముల ప్రోటీన్, 1.2 గ్రాముల ఫైబర్ మాత్రమే ఉన్నాయి. గతంలో పంపిణీ చేసిన చిక్కీలతో పోలిస్తే ప్రస్తుత హాస్టల్ విద్యార్థులకు ‘న్యూ గుడ్ థింగ్స్ మల్టీ మిల్లెట్ పీనట్ బార్‌లో ప్రోటీన్ సుమారు 1.25 గ్రాములు , ఫైబర్ 0.34 గ్రాములు తగ్గింది. అంతేకాకుండా చిక్కి బరువు కూడా 25 గ్రాముల నుంచి 20 గ్రాములకు తగ్గించారు. ప్రస్తుతం పాఠశాలల్లో పంపిణీ చేస్తున్న 25 గ్రాముల ట్రూ గుడ్ పీనట్ మిల్లెట్ చిక్కీలోనూ ప్రోటీన్ పరిమాణం తగ్గింది. గతంలో పంపిణీ చేసిన పీనట్ జాగరీ చిక్కీలో 100 గ్రాములకు 17 గ్రాముల ప్రోటీన్, 6.15 గ్రాముల ఫైబర్ ఉండగా, ప్రస్తుత ట్రూగుడ్ చిక్కీలో 15 గ్రాముల ప్రోటీన్, 6.10 గ్రాముల ఫైబర్ మాత్రమే ఉన్నాయి. ఒక్కో చిక్కీలో ప్రోటీన్ 4.25 గ్రాముల నుంచి 3.75 గ్రాములకు, ఫైబర్ 1.54 గ్రాముల తగ్గినట్లు ప్యాకెట్లపై ముద్రించిన పోషక విలువలు స్పష్టం చేస్తున్నాయి. పిల్లల ఎదుగుదలకు అవసరమైన ప్రోటీన్ పరిమాణాన్ని పెంచాల్సిన సమయంలో తగ్గించడం ఆందోళన కలిగించే అంశమని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు.
పోషకాలు కీలకం
పిల్లల ఎదుగుదలలో ప్రోటీన్ అత్యంత కీలకమైన పోషక పదార్థం. ఇది కండరాల అభివృద్ధి, ఎముకల పెరుగుదల, రోగని రోధక శక్తి పెంపులో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంతోపాటు మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. చిక్కీల్లో ప్రోటీన్, ఫైబర్ తగ్గితే దీర్ఘకాలంలో పిల్లలకు అందే మొత్తం పోషక విలువ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. పాఠశాలల్లో అందించే ఆహారం పిల్లల రోజువారీ పోషక అవసరాలను తీర్చేలా ఉండాలి. తరుచూ ఆహా రంలో నాణ్యత, పోషక విలువలను ఎప్పటికప్పుడు సమీక్షించి, అవసరమైతే ప్రోటీన్, ఫైబర్ పరిమాణాన్ని పెంచే చర్యలు తీసుకోవాలని పౌష్టికాహారం నిపుణులు సూచిస్తున్నారు.
hÌêÏÌZÏ C …-r-È-ÃyìlÄñæ$-sŒææ ѧéÅ-Æý‡$¦-ÌSMýS$ yöM>P ïÜ-™èlÐ]l$à Ð]l$«§éÅçßæ² ¿Z-f¯]l ç³£ýlMýS…ÌZ ¿êVýS-…V> Æøþ _MîSP A…¨-…^éÍÞ E…¨. AƇ$$™ól MýSâê-Ô>-ÌSË$ {´ëÆý‡…--¿ýæOÐðl$ Ð]lÊyýl$ ¯ðlÌSË$ VýSyìl-_¯é _MîSPË$ ç³…-í³×îæ ^ólíܯ]l §éQ-ÌêË$ ÌôæÐ]l#. Csîæ-Ð]lÌS °Æý‡Ó-íßæ…-_¯]l õ³Æð‡…sŒæÞ & sîæ^èlÆŠ‡Þ çÜÐ]l*-ÐólÔèæ… Æøk Ð]l*{™èl… A«¨M>-Æý‡$Ë$ çßæyéÐ]l#-yìlV> JMýS ÆøkMýS$ çÜÇ-ç³yé _MîSP-ÌS¯]l$ ç³…-í³×îæ ^ólíÜ-¯]lr$Ï Ñ§éÅ-Æý‡$¦Ë$ ^ðlº$™èl$-¯é²Æý‡$. hÌêÏÌZ G°Ñ$¨ {糿¶æ$™èlÓ þ°-Ķæ$-ÆŠ‡ MýSâê-Ô>-ÌSÌZÏ 2,369 Ð]l$…-¨, Ð]l$Æø Ð]lÊyýl$ GƇ$$-yðlyŠæ MýSâê-Ô>-ÌSÌZÏ 219 Ð]l$…¨ ѧéÅ-Æý‡$¦Ë$ ^èl§ýl$Ð]l#-™èl$-¯é²Æý‡$. D M>Ìôæ-iÌZÏ _MîSPË$ ç³…í³×îæ ^ólĶæ$yýl…Ìôæ§ýl$. AƇ¬™ól ç³…í³×îæ ^ólíÜ-¯]lr$Ï ¯]lÐðl*§ýl$ ^ólĶæ*ÌS¯]l² Ð]l†¢â¶æ$Ï E¯é²Ä¶æ$¯]l² BÆøç³-׿Ë$ ѯ]l-í³-çÜ$¢-¯é²Æ‡$$.


