ఈత పోటీల్లో పేట స్విమ్మర్లకు పతకాల పంట | - | Sakshi
Sakshi News home page

ఈత పోటీల్లో పేట స్విమ్మర్లకు పతకాల పంట

Aug 18 2026 9:08 AM | Updated on Aug 18 2026 9:08 AM

జగ్గయ్యపేటఅర్బన్‌: విజయవాడలోని ప్లోటర్స్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ స్విమ్మింగ్‌ ఫూల్‌లో ఈ నెల 16వ తేదీన బెజవాడ స్పోర్ట్స్‌ క్లబ్‌ ఆయా విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో జగ్గయ్యపేటకు చెందిన డ్రీమర్స్‌ స్విమ్మింగ్‌ అసోసియేషన్‌ నుంచి మొత్తం 21 మంది స్విమ్మర్లు 27 పతకాలు సాధించారు. డ్రీమర్స్‌ స్విమ్మింగ్‌ అసోసియేషన్‌ నుంచి కోచ్‌ పొట్టాబత్తిన సందీప్‌ ఆధ్వర్యంలో సిమ్మర్లు నాన్‌ మెడలిస్ట్‌ ఆరేళ్ల నుంచి 50 ఏళ్లలోపు వయస్సుల వారీగా ప్రీస్టయిల్‌ 25, 50మీటర్లు, బ్యాక్‌స్టోన్‌ 25 మీటర్ల ఈత పోటీల్లో సిమ్మర్లు పాల్గొని విజేతలుగా నిలిచారు. ఈ పోటీల్లో సిమ్మర్లు మొత్తం ఏడు బంగారు, ఆరు రజతం, 14 కాంస్య పతకాలు సాధించినట్లు టీం మేనేజర్‌ అన్నంనీడి కల్యాణ్‌ సోమవారం తెలిపారు. డాక్టర్‌ సామి నేని దీపక్‌, డాక్టర్‌ ఆళ్ల హరీష్‌(రెండు పతకాలు), సామినేని కీర్తిక, వేపన్జేరి ప్రణీత, గంజినబోయిన అభిమన్యు, కాసరెల్లి అశ్విన్‌ బంగారు పతకాలు సాధించగా, గజేంద్రన్‌ సంజనాదేవిశ్రీ, వర్తినేని చేతన్‌ శ్రీసాయి, మేక పూజన్‌సాయి, పోతురాజు జీవన్‌సాయి, జుత్తు మహిధర్‌, ఉపొత్తుల కార్తీక్‌ రజత పతకాలు సాధించారు. డాక్టర్‌ సామినేని దీపక్‌, సామి నేని కీర్తిక, అక్కిమళ్ల యశ్విక ఆనంది, వేపన్జేరి ప్రణీత, వేపన్జేరి హేమాన్షి అడ్డగొట్టం అర్షి, ఆళ్ల దన్వి, గంజినబోయిన అభిమన్యు, కాసరెల్లి అశ్విన్‌, సోమి శెట్టి మోక్ష నివాస్‌, ఈడ నిఖిల్‌ త్రిలోక్‌రాజ్‌, గజేంద్రన్‌ జైకార్తీక్‌, దార్ల శ్యామ్‌ విహాన్‌, అక్కిమళ్లతన్వీష్‌ క్యాంస పతకాలు సాధించారు. విజేతలకు స్విమ్మింగ్‌ అసోసియేషన్‌ ఫౌండర్‌, కోచ్‌ దంపతులు పొట్టాబత్తిన పాండురంగారావు, లక్ష్మి, అధ్యక్షుడు మందడపు శ్రీనివాసరావు, డాక్టర్‌ దీపక్‌కుమార్‌, కార్యదర్శి కలాలి నరేష్‌ అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement