చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో స్వీకరిస్తున్న అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించి ప్రజలకు సంతృప్తినివ్వాలని కృష్ణా జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ ఎం.నవీన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని సమావేశపు హాలులో సోమవారం పీజీఆర్‌ఎస్ కార్యక్రమం జరిగింది. డీఆర్వో శ్రీధర్‌రెడ్డి, కేఆర్‌ఆర్‌సీ ఎస్‌డీసీ నీలకంఠేశ్వరరెడ్డి, దిశ స్టేషన్ సీఐ వెంకటేశ్వరరావుతో కలిసి ఇన్‌చార్జి కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీజీఆర్‌ఎస్‌లో పెండింగ్ అర్జీల సంఖ్య తగ్గుతోందన్నారు. అయితే వివిధ శాఖల పరిధిలో ఇంకా పెండింగ్ అర్జీలు ఉన్నాయని, వాటిని పూర్తిస్థాయిలో పరిష్కరించాలని ఆదేశించారు. ఈ నెలాఖరులో కలెక్టర్ల సదస్సు జరగనున్న నేపథ్యంలో పెండింగ్ అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలన్నారు. గడువు దాటిన అర్జీలపై రోజూ ఉదయం సమీక్ష నిర్వహించి పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమస్య పరిష్కారం సాధ్యం కాకపోతే అందుకు గల కారణాలను అర్జీదారులకు స్పష్టంగా వివరించి, వారి అభిప్రాయాన్ని నమోదు చేసిన అనంతరం నిబంధనల ప్రకారం అర్జీని మూసివేయాలని సూచించారు. పీజీఆర్‌ఎస్ అర్జీల పరిష్కారంలో ఎంకై ్వరీ రిపోర్టులు, యాక్షన్ టేకెన్ రిపోర్టులు తదితర ఆధారాలను అప్‌లోడ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో 129 అర్జీలను స్వీకరించారు.
ముఖ్యమైన అర్జీలు ఇవీ..


