విజయవాడను గ్రేటర్‌ నగరంగా ప్రకటించాలి | - | Sakshi
Sakshi News home page

విజయవాడను గ్రేటర్‌ నగరంగా ప్రకటించాలి

Aug 18 2026 9:08 AM | Updated on Aug 18 2026 9:08 AM

కాంట్రాక్టర్ల మౌన ప్రదర్శన

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): విజయవాడను తక్షణమే గ్రేటర్‌ నగరంగా ప్రకటించాలని పోతిన మహేష్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కలెక్టర్‌కు పీజీఆర్‌ఎస్‌లో సోమవారం వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన కలెక్టరేట్‌ వద్ద మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో గ్రేటర్‌పై స్పష్టత ఇవ్వా లని కోరారు. మునిసిపల్‌ శాఖ మంత్రి ప్రక టన చేయాలని డిమాండ్‌ చేశారు. విజయవాడను గ్రేటర్‌గా ప్రకటించకపోతే తీరని నష్టం జరుగుతుందన్నారు. అన్ని రంగాల్లో ప్రాము ఖ్యత కలిగిన ఈ నగర పరిధిని విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చెప్పిన మావిగన్‌లో విజయవాడ కీలకంగా ఉందన్నారు. మంత్రి నారాయణ, ఎంపీ కేశి నేని చిన్ని స్పష్టమైన ప్రకటన చేయాలని, లేనిపక్షంలో ప్రజా సంఘాలు, మాజీ కార్పొరేటర్లతో కలిసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. వినతి పత్రం అందజేసిన వారిలో మాజీ కార్పొరేటర్లు ఆవాల మారుతి, సైకం సాయిబాబా, వాయిస్‌ ఆఫ్‌ మాల మహానాడు అధ్యక్షుడు వడ్లని శ్యామ్‌, పైడిపాటి రమేష్‌, అడ్డూరి తమ్మారావు, షేక్‌ షాహీనా ఉన్నారు.

134 మంది సర్టిఫికెట్ల పరిశీలన

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ సెంటర్‌లో ఏపీఈఏపీసెట్‌ (బైపీసీ స్ట్రీమ్‌) స్పెషల్‌ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన సోమవారం ప్రారంభమైంది. ఎన్‌సీసీ–60, సీఏపీ–50, దివ్యాంగులు–9, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌–3 స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌–12 మంది మొత్తం 134 మంది సర్టిపికెట్లను పరిశీలించామని హెల్ప్‌లైన్‌ సెంటర్‌ కో–ఆర్డినేటర్‌ ఎం.విజయసారథి తెలిపారు. మంగళవారం ఎన్‌సీసీ, స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌, సీఏపీ–35001 నుంచి చివరి ర్యాంకు వరకు, ఆంగ్లో ఇండియన్స్‌–1 నుంచి చివర ర్యాంకు వరకు, స్కౌట్‌ అండ్‌ గైడ్స్‌ 30001 నుంచి చివరి ర్యాంకు పొందిన వారి సర్టిఫికెట్లను పరిశీలిస్తామని పేర్కొన్నారు.

సైబర్‌ నేరాలపై అప్రమత్తత అవసరం

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): ప్రజలు సైబర్‌ నేరాలపై అప్రత్తంగా ఉండాలని పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ పోలీసు కమిషనరేటర్‌ ఆధ్వర్యంలో టాస్క్‌ ఆధారిత సైబర్‌ నేరాలపై అవగాహన కార్యక్రమాల్లో భాగంగా సోమవారం జిల్లాలోని అన్ని పోలీసుస్టేషన్ల పరిధిల్లో మొదటి ప్రత్యేక కార్యక్రాలు నిర్వహించారు. సైబర్‌ నేరాలు, డిజిటల్‌ అరెస్ట్‌ వంటి నేరాలు జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త లపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. జి.కొండూరు మండలం గంగినేని గ్రామంలో పల్లె నిద్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ రామ చంద్రరావు మాట్లాడుతూ.. పోలీస్‌ కమిషనరేట్‌లో సైబర్‌ నేరాలను అరికట్టడమే లక్ష్యంగా చేసుకుని వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. డిజిటల్‌ యుగంలో సులభంగా డబ్బు సంపాదించొచ్చంటూ సైబర్‌ నేరస్తులు ప్రజలకు ఆశ చూపి మోసగిస్తారని హెచ్చరించారు. ఎవరైనా సైబర్‌ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.

పటమట(విజయవాడతూర్పు): విజయవాడ నగర పాలక సంస్థలో పలు అభివృద్ధి పనులు చేసే కాంట్రాక్టర్లు గత వారం రోజులుగా చేస్తున్న సమ్మె కొనసాగుతోంది. తమకు రావాల్సిన రూ.400 కోట్ల విలువైన బిల్లులు వెంటనే చెల్లించాలని వారు ఆందోళన చేస్తు న్నారు. అందులో భాగంగా సోమవారం ముఖానికి మాస్కులు ధరించి మౌనంగా అధికారులను, సిబ్బందిని కలిసి ప్లకార్డుల ద్వారా తమ గోడును వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ల అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి రాయన ఆదిబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement