
ఇటీవల కాలంలో యువతకు సాహస యాత్రలపై ఆసక్తి పెరుగుతోంది. ఉ
ఇబ్రహీంపట్నం: విజయవాడ సమీపంలో కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో ప్రకృతి అందాలు దాగి ఉన్నాయి. ఖిల్లాతో పాటు లోయలు, అడవిలో జలపాతాలు, కోట బురుజులు, కోనేరులు పర్యాటకులను కనువిందు చేస్తాయి. అంతేకాక కొండపల్లి ఫారెస్ట్ ట్రెక్కింగ్‌కు అనుకూలమైన ప్రాంతంగా ఇప్పటికే గుర్తించారు. 2018లో ఖిల్లా వేడుకల్లో భాగంగా ట్రెక్కింగ్ నిర్వహించి ప్రకృతి ప్రేమికులను ప్రోత్సహించారు. విజయవాడ యూత్ హాస్టల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సభ్యులు గతంలో ట్రెక్కింగ్ నిర్వహించి అనేక నూతన ప్రదేశాలు, ఫిరంగ్‌లు, సొరంగ మార్గాలు, రాతి శిలలను గుర్తించారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, జేసీ ఇలక్కియా, ఆర్డీవో చైతన్య సైతం ఖిల్లాపైకి ట్రెక్కింగ్ నిర్వహించి విద్యార్థుల్లో ఉత్సాహం నింపారు. ఈ క్రమంలో విద్యార్థులు, యువతీ యువకులు, క్రీడాకారులు వారాంతపు సెలవుల్లో ట్రెక్కింగ్ చేయడం ఆనవాయితీగా మారింది.
సాహసం.. శ్వాసగా..
కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ చారిత్రక సంపద, సాహస క్రీడలకు వేదికగా మారింది. ఇబ్రహీంపట్నం, జి.కొండూరు, కంచికచర్ల, నందిగామ మండలాల పరిధిలోని వివిధ గ్రామాల్లో సుమారు 28వేల ఎకరాల్లో ఫారెస్ట్ విస్తరించింది. ఈ గ్రామాల పరిధిలో ట్రెక్కింగ్ ప్రదేశాలు, జలపాతాలు, బ్రిటీష్ కాలం నాటి ఫిరంగ్‌లు, సొరంగ మార్గాలు, ఆయుర్వేద వన వృక్షాలు, సీతాకోకచిలుకలు, ఖిల్లా పురాతన కట్టడాలు కనువిందు చేస్తాయి. ఖిల్లా నుంచి కుడి ఎడమల వైపు సుమారు ఒకటి నుంచి మూడు కిలో మీటర్ల దూరంలో రాతి శిలలు, ట్రెక్కింగ్ ప్రదేశాలు ఉన్నాయి. వీటితో పాటు నెమలిధార, మావూళ్లమ్మ తీర్థం, బేబీ చిత్రకూట్, కొంగుధార, వనమాలి, చిట్టితుంబరఽ దార, సప్తస్వరదారులు, కుడి ఎడమల జలపాతాలు దర్శనమిస్తాయి.
కొండపల్లి ఫారెస్ట్‌లో ట్రెక్కింగ్ చేస్తూ కొండపైకి చేరుకున్న విద్యార్థులు(ఫైల్)
ట్రెక్కింగ్ ప్రేమికులకు వరంలా మారిన రిజర్వ్ ఫారెస్ట్ సాహస యాత్రలపై ఆసక్తితో ముందడుగు ప్రకృతి రమణీయతకు తోడు, ఆరోగ్యదాయకం కావడంతో మొగ్గు
అందరూ చేయొచ్చు..
సాహసోపేతంగా చేసే ట్రెక్కింగ్‌తో యువతీ యువకుల్లో ధైర్య సాహసాలు పెరుగుతాయి. ట్రెక్కింగ్ చేయగలిగిన వారు జీవితంలో ఎదురయ్యే ఎటువంటి ఒడిదుడుకులైనా సమర్థంగా ఎదుర్కొని మానసికంగా ఎదుగుతారని నిపుణులు చెబుతున్నారు. ట్రెక్కింగ్‌లో నాలుగేళ్ల చిన్నారుల నుంచి 50ఏళ్ల వయస్సు గల ఎవరైనా పాల్గొనవచ్చు. విజయవాడ పరిసర ప్రాంతాల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి సైతం రిజర్వ్ ఫారెస్ట్‌కు చేరుకుని ట్రెక్కింగ్ నిర్వహిస్తుంటారు. ఇక్కడ ఎత్తయిన ఒంటిమిట్ట కొండ పైకి ట్రెక్కింగ్ చేస్తే విజయవాడ పట్టణం కనిపిస్తుంది.